అనంతపురం జిల్లాకు చెందిన రాజకీయ కుటుంబం జేసీ ఫ్యామిలీ. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు.. తాడిపత్రి, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల్లోతమదైన శైలిలో చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. దాదాపు 40 ఏళ్లుగా తాడిపత్రి నియోజకవర్గం ననుంచి విజయం దక్కించుకున్న ఈ కుటుంబానికి ఈ జిల్లాపై గట్టి పట్టుంది. అయితే.. అది తమ కు మాత్రమే పరిమితం కావాలని.. వేరేవారు ఎవరూ కూడా వేలు పెట్టకూడదని.. కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు అలానే సాగిపోయంది.

అయితే… రాజకీయాలు మారుతున్నాయి. పరిస్థితులు కూడా మారుతున్నాయి. యువ నాయకులు వస్తున్నా రు. దీంతో జేసీ వర్గానికి అడపా దడపా.. అడ్డుకట్టలు పడుతున్నాయి. దీనిని వారుసహించలేక పోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా అనంతపురం పార్లమెంటు పరిదిలో ఇప్పుడు వైసీపీ దూకుడు ఎక్కువగా ఉంది. తాడిపత్రిని సాధించిన వైసీపీ.. అనంతపురం పార్లమెంటును కూడా కైవసం చేసుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పట్టు కోసం.. జేసీ బ్రదర్స్ తపించిపోతున్నారు. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లోనూ కలియదిరుగుతున్నారు.

కానీ, గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన జేసీ వర్గం.. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరింది. ఈ క్రమంలో అనంత పార్లమెంటు నుంచి దివాకర్‌రెడ్డి, తాడిపత్రి నుంచి ప్రభాకర్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఇద్దరూ తమ వారసులను రంగంలోకి దింపారు. కానీ, ఇద్దరూ ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో అయినా.. తమ వారసులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంటు పరిధిలో మరింత పట్టు కోసం.. ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే.. దీనిని టీడీపీలోని ఒక వర్గం సహించే పరిస్థితిలో లేదు. దీంతో జేసీ వర్గాన్ని తమ తమ నియోజక వర్గాల్లో కకట్టడి చేయాలంటూ.. చంద్రబాబు విన్నవించారు.. దీంతో బాబు సైతం వారిని వారించారు.. ఇదే ఇప్పుడు జేసీ వర్గంలో గుబులు రేపుతోంది. జిల్లాపై పట్టున్న తమను కట్టడి చేయడం ఏంటని లోలోన మథన పడుతోంది. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా టీడీపీలో నే ఉన్నప్పటికీ.. వాయిస్ లేకుండా మౌనం వహిస్తోంది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు కానీ.. చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు ఏదో అన్నారని.. ఆయన ధర్నా చేసినప్పుడు కానీ.. ఈ కుటుంబం స్పందించలేదు.

దీంతో జేసీ వర్గం అలక బూనిందని.. అంటున్నారు. దీనిని సరిచేసేందుకు చంద్రబాబే రంగం దిగాలన్నట్టుగా కూడా వీరు.. వ్యవహరిస్తున్నారు. మరి చంద్రబాబు రెండు మెట్లు దిగుతారా.? లేక.. వారినే దింపుతారా? అనేది చూడాలి.

Discussion about this post