గత ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మందే ఉన్నారు…జగన్ గాలిలో చాలామంది లక్కీగా గెలిచేశారు…అలా లక్కీగా గెలిచిన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు ఎక్కువే ఉన్నారు. అలా కృష్ణా జిల్లాలో కూడా కొందరు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేశ్ బాబు, పామర్రు నుంచి కైలే అనిల్ కుమార్, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు, నందిగామ నుంచి మొండితోక జగన్ మోహన్ రావు గెలిచారు.

అయితే వీరిలో మొదటి సారి పోటీకి దిగి…మొదటి సారే విజయం సాధించింది మాత్రం అనిల్ కుమార్, దూలం నాగేశ్వరరావు. ఈ ఇద్దరు తొలిసారి బరిలో దిగి గెలిచారు. ఇక వసంత, సింహాద్రి, జగన్ మాత్రం అంతకముందు పోటీ చేసి ఓడిపోయి..2019 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొత్తానికి ఈ ఐదుగురు తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇలా తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వీరికి నెక్స్ట్ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే పెద్దగా అవకాశాలు లేవనే తెలుస్తోంది.గత ఎన్నికల్లో టీడీపీపై వ్యతిరేకత, జగన్ గాలి, జనసేన ఓట్లు చీల్చడం వల్ల అనూహ్యంగా ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. వీరిలో ఎవరూ కూడా సొంత బలంతో గెలవలేదనే చెప్పాలి. అయితే అధికారంలోకి వచ్చాక సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే పెద్దగా లేదనే చెప్పాలి. ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు తప్ప…వీరు స్పెషల్ గా చేసే కార్యక్రమాలు ఏమి కనబడటం లేదు.

అందుకే మూడేళ్లలోనే ఈ కొత్త ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని బాగానే మూటగట్టుకున్నారు..పైగా ఇసుక, మైనింగ్, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు కూడా ఎక్కువే చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. దీంతో ఎమ్మెల్యేలపై నెగిటివ్ పెరిగింది..ఇదే సమయంలో ఆయా స్థానాల్లో టీడీపీ నేతలు పుంజుకుంటున్నారు. ఈ పరిణామాలని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కొత్త ఎమ్మెల్యేలకు టీడీపీ చెక్ పెట్టేలా ఉంది.
Discussion about this post