రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ అనూహ్యంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నియోజకవర్గాల్లో టీడీపీ చాలా వరకు పికప్ అవుతూ వస్తుంది. ఈ రెండున్నర ఏళ్లలో అనూహ్యంగా కొన్ని స్థానాల్లో టీడీపీ పుంజుకుంది. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం లాంటి పరిణామాలు టీడీపీకి కలిసొస్తున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరుల్లో సీన్ మారిపోతుంది.


గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల వైసీపీ కేవలం తక్కువ మెజారిటీలతోనే బయటపడింది. మచిలీపట్నంలో పేర్ని నాని సుమారు 5 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా, ఏలూరులో ఆళ్ళ నాని 4 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై గెలిచారు. అయితే ఈ స్థానాల్లో జనసేన ఎక్కువ ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ గెలుపు సాధ్యమైందని చెప్పొచ్చు. అయితే ఇలా వైసీపీ నుంచి గెలిచిన పేర్ని నాని, ఆళ్ళ నానీలు జగన్ క్యాబినెట్‌లో మంత్రులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.


ఇక మంత్రులుగా ఇద్దరు నానీలు గొప్ప పనితీరు ఏమి కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు. మంత్రులుగా వీరికి మంచి మార్కులు కూడా పడటం లేదని తెలుస్తోంది. కొద్దో గొప్పో పేర్ని, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ కాస్త హైలైట్ అవుతున్నారు గానీ…ఆళ్ళ నాని అయితే అది కూడా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఇద్దరు మంత్రులుగా ఉన్నా సరే…వారి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి కూడా తక్కువే. దీంతో ఇద్దరు నానీలపై నెగిటివ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

అదే సమయంలో రెండుచోట్ల టీడీపీ నేతలు పుంజుకుంటున్నారు. మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర మొదట నుంచి దూకుడుగానే పనిచేస్తున్నారు. రెండున్నర ఏళ్లలో ఆయన చాలావరకు పికప్ అయ్యారు. అటు ఏలూరులో టీడీపీ నేత బడేటి చంటి సైతం యాక్టివ్‌గా ఉన్నారు. మొత్తానికైతే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ రెండు సీట్లు టీడీపీ చేతికి చిక్కేలా ఉన్నాయి. జనసేన సపోర్ట్ ఉంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు.

Discussion about this post