ఏపీ అసెంబ్లీ మరో తమిళనాడు శాసన సభ కానుందా? అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరగనుందా? వైసీపీపై పైచేయి సాధించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రస్తుతం టీడీపీకి అత్యంత కీలకమైన సభా సమరం ఇది. రెండున్నరేళ్లుగా ప్రతిపక్షంగా రాజకీయాలు చేస్తున్నా.. టీడీపీకి ఆశించిన విధంగా మైలేజీ రాలేదు.. అంతేకాదు.. త్వరలోనే ఎన్నికలు కూడా ఉన్నాయని.. పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని ముందుకు నడిపించాలంటే.. దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో వైసీపీపై తీవ్రస్థాయిలో విజృంభించాల్సిన అవసరం ఉందని టీడీపీ నాయకులు భావిస్తు న్నారు. పైగా..ఈ దఫా సభలకు చంద్రబాబు హాజరు కావడం లేదు. దీంతో చంద్రబాబు లేని లోటును కూడా టీడీపీ నాయకులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీంతో టీడీపీ నేతలు ఒకరినిమించి మరొకరు తమ సత్తా చాటేందుకు.. ప్రయత్నించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అచ్చె న్న, బుచ్చయ్య, నిమ్మల రామానాయుడు.. వంటి ముఖ్య నాయకులు కీలక రోల్ పోషించే అవకాశం ఉంది.

అదేసమయంలో ప్రబుత్వ వ్యూహాలకు ప్రతివ్యూహాలు.. ఎత్తులకు పైఎత్తులు వేయాల్సిన అవసరం పైనా.. టీడీపీ ఎమ్మెల్యేలు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే.. పార్టీ పక్కా వ్యూహంతో ముందుకుసాగాలని నిర్ణయిం చుకుంది. ఈ క్రమంలోనే తొలి రోజు నుంచి భారీ ఎత్తున టీడీపీ సభ్యులు సత్తా చాటారు. ప్రస్తుతం టీడీపీ తొలి రోజు అనుసరించిన వ్యూహం పట్ల.. సోషల్ మీడియాలోనూ పాజిటివ్ టాక్‌వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మున్ముందు కూడా టీడీపీ సత్తా చాటుకునే అవకాశం ఉందని నాయకులు అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా..అధికార, ప్రతిపక్షాల మధ్య పెరిగే ఈ వ్యూహాలతో ఏపీ అసెంబ్లీతమిళనాడు అసెంబ్లీగా మారిపోతుందా? అనే సందేహాలు కూడా ఉన్నాయి.
Discussion about this post