ఔను! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ పుంజుకుందని.. ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారని.. చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. నాయకులు మాత్రం దీనిని లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మచ్చుకు ఓ నాలుగు జిల్లాలను తీసుకుని.. చంద్రబాబు సర్వే చేయించారు. ఈ సర్వేల్లో.. వచ్చిన నివేదికను కొందరు సీనియర్లకు ఆయన ఇచ్చారు. దీని ప్రకారం.. ఆయా జిల్లాల్లో వైసీపీ ఘోరంగా పరాజయం అవుతున్న వైనం కళ్లకు కట్టినట్టుగా ఉందని.. ఒక సీనియర్ నాయకుడు మహానాడు వేదికగా వె్ల్లడించడం.. సంచలనంగా మారింది.

2014 ఎన్నికల్లో చాలా జిల్లాల్లో టీడీపీ పుంజుకుంది. భారీ ఎత్తున విజయం దక్కించుకుంది. అయితే.. అనూహ్యంగా 2019 ఎన్నికలకు వచ్చే సరికి అవే జిల్లాల్లో పార్టీ పరాజయం పాలైంది. ఆశించిన విధంగా సీట్లు రాలేదు. ఇక, నెల్లూరు, కర్నూలు వంటి చోట్ల టీడీపీ క్లీన్ స్పీప్ అయిపోయింది. అయితే.. కేవలం మూడు సంవత్సరాల్లో అలాంటి జిల్లాల్లో కూడా టీడీపీ పుంజుకుందనేది చంద్రబాబు చెబుతున్న మాట. అయితే.. చాలా మంది నాయకులు బయటకు రావడం లేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తే.. అప్పుడు చూసుకుందాం.. తమకు టికెట్లు ఇస్తే.. అప్పుడు మాట్లాడుకుందాం.. అనేధోరణి ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా నాలుగు జిల్లాల్లో టీడీపీ పరిస్థితిపై అంతర్గతంగా చేయించిన సర్వేల రిపోర్టును చంద్రబాబు బయట పెట్టారు. ఆ జిల్లాలు ప్రకాశం, గుంటూరు, అనంతపురం, చిత్తూరు. ఈ నాలుగు జిల్లాల్లోనూ.. టీడీపీ జోరు ఓ రేంజ్‌లో కొనసాగు తోందని.. సర్వే రిపోర్టు వెల్లడించింది. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లోనే 4 చోట్ల టీడీపీ విజయం సాధించింది. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు వంటి కీలక నియోజకవర్గం సహా.. ఒకటి రెండు తప్ప.. అన్ని నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలోనే పడతా యని.. స ర్వే రిపోర్టు స్పష్టం చేసింది.

ఇక, గుంటూరులోనూ.. ఇదే తరహా పరిస్తితి నెలకొంది. వైసీపీ నాయకులు ప్రజలకు చేరువ కాలేక పోవడం.. ఆధిపత్య ధోరణి, అమరావతి పట్ల వైసీపీ నేతల వ్యవహారం వంటివి టీడీపీకి బాగా కలిసి వస్తున్నాయి. దీంతో ఇక్కడి కీలకమైన మంగళగిరి, మాచర్ల వంటి నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం దక్కించుకుని ఒకటి రెండు తప్ప.. అన్నిచోట్లా జయభేరి మోగించడం ఖాయమని తేలింది.అదేవిధంగా అనంతపురంలో ఈ సారి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పార్టీకి అందిన సర్వే స్పష్టం చేసింది. ఇక, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. దీంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయం చర్చకు దారితీస్తోంది. ఆ నాలుగు జిల్లాల్లోనూ నాయకులు దూకుడుగా ఉండడం. పార్టీ విషయంలో అంకిత భావంతో పనిచేయడం.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడం వంటివి పనిచేస్తున్నాయని.. అందుకే ఆయా జిల్లాల్లో పార్టీ పూర్తిగా గెలిచే అవకాశం ఉందని.. సర్వే నివేదిక స్పష్టం చేసింది. దీనిని బట్టి.. ఇతర జిల్లాల్లోనూ.. నాయకులు ఇలానే ముందుకు సాగితే..టీడీపీకి తిరుగులేదని.. అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post