రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. టీడీపీదే ఒంటరి విజయమా? ఎవరితోనూ పొత్తు అవసరం లేదా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి వచ్చే ఎన్నికలకు రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మాత్రం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఖచ్చితంగా టీడీపీకి అనుకూ లంగా మారుతుందని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీపై అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎవరూ కూడాసంతో షంగా లేరు. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలిసింది.

ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా వచ్చిన సంకేతాలను పరిగణనలోకి తీసుకునే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు గడపగడప కు కార్యక్రమం ఎంచుకున్నారు. అయినప్పటికీ.. ప్రజలకు నాయకులకు మధ్య ఎక్కడా పొంతన కుదరడం లేదు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులు సమాధానం చెప్పలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అనూహ్యంగా టీడీపీకి అనుకూలంగా మారుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రాష్ట్రానికి ఒక భవిష్యత్తు లేదు.

ఒక రాజధాని లేదు. ఒక దశ దిశ కూడా లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబును ఎక్కువగా మంది ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వర్గాలను పక్కన పెడితే.. మిగిలిన వారంతా కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారనే చర్చ టీడీపీలో సాగుతోంది. ఇది వాస్తవం కూడా. చంద్రబాబు చేస్తున్న పర్యటనల్లో మెజారిటీ ప్రజలు ఆయనను తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు.

ఉపాధి, ఉద్యోగాలు.. సహా అనేక సమస్యలకు చంద్రబాబు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరని.. ప్రజలు నమ్ముతున్నారు. అదేసమయంలో అభివృద్ధి కి ఆయనైతేనే కేరాఫ్‌గా ఉంటారని.. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందుతుందని.. కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా టీడీపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామమనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీడీపీ గెలుపు ఏకపక్షంగా సాగుతుందని అంటున్నారు. అయితే.. ఇప్పుడు జరిగే అవకాశం లేకపోవడం గమనార్హం. కాబట్టి.. ఇదే రేంజ్‌ను టీడీపీ వచ్చే రెండేళ్లపాటు నిలుపుకోవాలని చెబుతున్నారు.

Discussion about this post