రోజురోజుకూ అధికార వైసీపీ ఎలాంటి స్ట్రాటజీలు వేస్తుందో అర్ధం కాకుండా ఉంది…టీడీపీని దెబ్బకొట్టడానికి అనేక రకాల వ్యూహాలు వేస్తూ ముందుకెళుతుంది. అయితే ఆ వ్యూహాలు రివర్స్ అయ్యి చివరికి వైసీపీనే నవ్వుల పాలయ్యే పరిస్తితి ఉంటుంది. ఇటీవల ఏపీలో జరిగిన కొన్ని ఘటనల్లో వైసీపీ చేసిన పనులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఏదో టీడీపీకి చెక్ పెడుతున్నామనుకుని వైసీపీ అనుకుంటుంది….కానీ వారికి వారే చెక్ పెట్టుకుంటున్నామనే విషయం మాత్రం వైసీపీకి అర్ధం కావడం లేదు.

తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన వైసీపీ ఎంపీలు అలాగే బుక్ అయ్యారు. విజయసాయి రెడ్డి నేతృత్వంలోని ఎంపీలు ఢిల్లీ వెళ్ళి.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ, అసభ్యకరమైన భాష మాట్లాడుతూ ప్రజల మెదళ్లను విషతుల్యం చేస్తున్నారని, ముఖ్యమంత్రిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రమైన అసభ్య పదజాలం వాడారని, దేవినేని ఉమా, బోండా ఉమా, లోకేష్‌లు బూతులు మాట్లాడుతున్నారానే అందుకే…టీడీపీ గుర్తింపు రద్దుని రద్దు చేయాలని కోరారు.

సరే ఒకటి మాట అనుకుంటే….బూతులు మాట్లాడితే ఒక రాజకీయ పార్టీ గుర్తింపు రద్దు అయిపోతుందా? అంటే ఆ విషయం వైసీపీలో ఉన్న మేధావులకే తెలియాలి. ఇంకా టీడీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారో….అసలు వైసీపీ నేతలు బూతులు మాట్లాడకుండా నీతులు చెబుతున్నారో అనే విషయాలు జనాలకు బాగా తెలుసు. పట్టాభి..బొషిడికే అన్నారు…అది కూడా సజ్జలని, కానీ అది జగన్‌కు అన్వయించుకున్నారు…పైగా దానికి కొత్త అర్ధం తీసుకొచ్చారు. సరే ఏది మాట్లాడినా అది తప్పే..అందుకు తగ్గట్టుగా ఆయన్ని జైల్లో పెట్టారు.

పైగా అలా మాట్లాడినందుకు పట్టాభిపై పోక్సో చట్టం కింద విచారణ జరపాలని ఎంపీ గోరంట్ల మాధవ్..కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు లేఖ రాసి…జ్ఞాన గుళిక వదిలారు. అసలు పోక్సో చట్టం అంటే చిన్న పిల్లలని లైగింక వేధింపులకు గురిచేసే వారిపై చర్యలు తీసుకునే చట్టం. అంటే వైసీపీ ఎంపీల కామెడీ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Discussion about this post