May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

 కృష్ణా కంచుకోటల్లో టీడీపీ హవా..ఈ సారి డౌట్ లేనట్లే.!  

ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట…ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కావడంతో మొదట నుంచి ఈ జిల్లాలో టి‌డి‌పి హవా నడుస్తుంది. అందులోనూ కొన్ని నియోజకవర్గాల్లో టి‌డి‌పి ప్రభావం బాగా ఉంటుంది. ఎక్కువసార్లు గెలుస్తూ వస్తుంది. అయితే గత ఎన్నికల్లో కంచుకోటలు అంటూ ఏమి లేవు..అన్నీ చోట్ల వైసీపీ హవా నడిచింది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన కంచుకోటలని మళ్ళీ తిరిగి దక్కించుకోవాలని టి‌డి‌పి చూస్తుంది.

ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు దిశగా టి‌డి‌పి ముందుకెళుతుంది. జిల్లాలో టి‌డి‌పికి మొదట నుంచి ఉన్న కంచుకోటలు గుడివాడ, గన్నవరం..ఇప్పుడు ఆ రెండు చోట్ల వైసీపీ హవా ఉంది. అయితే ఈ రెండు చోట్ల టి‌డి‌పికి బలమైన అభ్యర్ధులు పెడితే..గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ రెండు పక్కన పెడితే..టి‌డి‌పి డౌట్ లేకుండా గెలుపు అవకాశాలు ఉన్న సీట్లలో మైలవరం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి నుంచి అనూహ్యంగా దేవినేని ఉమా ఓడిపోయారు. తొలిసారి ఆయనకు ఓటమి ఎదురైంది. ఈ సారి మాత్రం ఆయన గెలుపు దిశగా వెళుతున్నారు.

ఇటు నందిగామ, జగ్గయ్యపేట స్థానాలు టి‌డి‌పికి కంచుకోటలే. గత ఎన్నికల్లో రెండు చోట్ల టి‌డి‌పి ఓడింది..కానీ ఈ సారి మాత్రం రెండు చోట్ల గెలుపు దిశగా ముందుకెళుతుంది. ఆ తర్వాత టి‌డి‌పికి కాస్త పట్టున్న స్థానాలు మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ స్థానాలు..ఈ మూడు చోట్ల టి‌డి‌పి బలం పెరిగింది..కానీ జనసేన ప్రభావం ఉంది. జనసేనతో పొత్తు ఉంటే ఈ మూడు చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సారి కృష్ణాలో టి‌డి‌పి కంచుకోటలని తిరిగి కైవసం చేసుకోనుంది.