టీడీపీ-జనసేన పోత్తు ఫిక్స్ అయిపోయింది..అందులో ఎలాంటి డౌట్ లేదు..ఈ పార్టీలతో బిజేపి కలుస్తుందా? లేదా? అనేది తర్వాత విషయం. అయినా బిజేపికి పెద్ద బలం లేదు కాబట్టి ఆ పార్టీని లెక్కలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రంలో బలంగా ఉండటం వల్లే..ఆ పార్టీతో పోత్తు అని చంద్రబాబు, పవన్ అంటున్నారు. సరే ఆ విషయం పక్కన పెడితే..ప్రధానంగా టిడిపి-జనసేన పోత్తు అనేది మెయిన్. ఇక ఈ రెండు పార్టీల మధ్య పోత్తు ఉంటే వైసీపీకి భారీ షాక్ తప్పదనే చెప్పాలి.
గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. విశాఖ టూ గుంటూరు వరకు జనసేన ఓట్లు బాగా చీల్చింది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు..ఈ ఐదు జిల్లాలు కలిపి 82 సీట్లు ఉన్నాయి..ఆ సీట్లలో వైసీపీ 67 సీట్లు గెలుచుకుంటే, టిడిపి 14, జనసేన 1 సీటు గెలుచుకుంది.

వైసీపీ గెలుచుకున్న 67 సీట్లలో జనసేన ఓట్లు చీల్చడం వల్ల గెలిచిన సీట్లు 40 పైనే ఉన్నాయి. అదే టిడిపి-జనసేన పోత్తు ఉంటే వైసీపీ 40 సీట్లలో గెలిచేది కాదు. ఇప్పుడు పోత్తు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో వైసీపీకి షాక్ తప్పదు. ఇక టిడిపి-జనసేన పోత్తు ప్రభావం కృష్ణా జిల్లాలో భారీగానే ఉండే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలో 16 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 14, టిడిపి 2 సీట్లు గెలుచుకుంది.
ఇప్పుడు పోత్తు ఉంటే వైసీపీ 4 సీట్ల వరకు గెలుచుకోవచ్చు..మిగిలిన సీట్లు టిడిపి-జనసేన వశం అవుతాయి. అయితే గత ఎన్నికల్లో టిడిపి కంటే వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువగా ఉన్న స్థానాలు..మచిలీపట్నం, పెడన, కైకలూరు, అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, వెస్ట్ సీట్లు..ఈ సారి ఈ సీట్లలో వైసీపీ గెలవడం కష్టమే.