ఎట్టకేలకు టీడీపీ-జనసేన పార్టీల పొత్తు గురించి ఒక క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే..అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ కల్యాణ్ గాని పొత్తుకు రెడీ అని అర్ధమవుతుంది..ఇప్పటికే బాబు పొత్తు విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు…ఇటు పవన్ సైతం తాజాగా పొత్తు విషయంలో క్లారిటీ ఇచ్చేశారు..మొత్తానికి పొత్తు సెట్ అయిపోతుందని అర్ధమవుతుంది. అయితే ఈ పొత్తులో బీజేపీ కలిసొచ్చిన, కలవకపోయిన ఇబ్బంది ఏమి లేదు.

ఇక టీడీపీ-జనసేనలు గాని కలిస్తే వైసీపీ డ్యామేజ్ గట్టిగానే ఉంటుందని చెప్పొచ్చు..కాకపోతే రాష్ట్రం మొత్తం మీద పొత్తు ప్రభావం లేకపోయిన…గుంటూరు జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు పొత్తు ప్రభావం ఎక్కువ ఉంటుంది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో రెండు పార్టీలు తీవ్రంగా ప్రభావం చూపుతాయి…ఈ జిల్లాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునే ఛాన్స్ ఉంది…ఇక వైసీపీకి గెలవడానికి ఇబ్బంది అవుతుందనే చెప్పొచ్చు.

ఒకసారి పొత్తు ప్రభావం ఉన్న సీట్ల లెక్కలు చూస్తే…గుంటూరులో ఐదారు సీట్లు ఉన్నాయి..అటు కృష్ణా జిల్లాకు వస్తే 7-8 సీట్లలో పొత్తు ప్రభావం ఉంటుంది..ఈ సీట్లలో వైసీపీ గెలుపు దాదాపు కష్టమే. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకొస్తే…10-12 సీట్లు ఉన్నాయి..పొత్తు వల్ల కనీసం పది సీట్లలో వైసీపీకి గెలుపు అవకాశం ఉండదు. అటు తూర్పులో 13-14 సీట్లలో టీడీపీ-జనసేనలు సత్తా చాటడం ఖాయం..ఏ మాత్రం డౌట్ లేకుండా తూర్పులో మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయి.

విశాఖలో కూడా టీడీపీ-జనసేన ప్రభావం ఎక్కువే ఉంటుంది…దాదాపు 6-7 సీట్లలో వైసీపీకి చెక్ పడొచ్చు. ఇక విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 2-3 సీట్లలో పొత్తు ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఓ 50 సీట్లలో పొత్తు ప్రభావం ఉంటుంది…ఖచ్చితంగా పొత్తు వల్ల 50 సీట్లు గెలుచుకోవచ్చు…ఇక మిగిలిన సీట్లలో టీడీపీ సొంత బలం మీద గెలుచుకు రావాలి…ముఖ్యంగా రాయలసీమలో..టీడీపీ బలం మీదే నడవాలి. అక్కడ కొన్ని సీట్లు గెలుచుకుంటే…టీడీపీ-జనసేనలు అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు.

Discussion about this post