గత ఎన్నికల్లో టీడీపీకి ఎలాంటి ఓటమి ఎదురైందో చెప్పాల్సిన పని లేదు. చాలా దారుణమైన ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. దాదాపు అన్నీ జిల్లాల్లో టీడీపీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. కానీ కొద్దో గొప్పో మూడు జిల్లాలు టీడీపీ పరువు కాపాడాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలు టీడీపీకి కాస్త అండగా నిలబడ్డాయి. ఈ మూడు జిల్లాల్లో టీడీపీ నాలుగేసి సీట్లు చొప్పున గెలుచుకుంది.

అంటే మిగతా జిల్లాల కంటే ఈ మూడు జిల్లాల్లో టీడీపీకి బెటర్ ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఇలా టీడీపీ పరువు కాపాడిన ఈ మూడు జిల్లాలు వచ్చే ఎన్నికల్లో సైతం బాగానే కలిసొచ్చేలా ఉన్నాయి. ఈ రెండున్నర ఏళ్లలోనే ఏపీ రాజకీయాలు చాలా మారాయి. గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితి ఇప్పుడు కనిపించడం లేదు. అంటే అప్పుడు వైసీపీకి పూర్తిగా అనుకూలమైన వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ కూడా పికప్ అయింది.కాకపోతే వైసీపీ ఆధిక్యంలోనే ఉంది…టీడీపీ ఇంకా లీడ్ తెచ్చుకోలేదు. అయితే ఇంకా కష్టపడితే వచ్చే రెండున్నర ఏళ్లలో టీడీపీకి పికప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, తూర్పు, ప్రకాశం జిల్లాల్లో ఈ సారి టీడీపీ సాధించేలా కనిపిస్తోంది. మెజారిటీ సీట్లు ఆ పార్టీకే వచ్చేలా ఉన్నాయి. విశాఖలో మొత్తం 15 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి విశాఖలో పోటాపోటి వాతావరణం అన్నట్లు పరిస్తితి ఉంది. ఇక ఎన్నికల సమయానికి ఇది మరింత మారితే…టీడీపీకి లీడ్ వచ్చేస్తుంది.

ఇటు తూర్పులో కూడా టీడీపీ చాలా వరకు పికప్ అయింది. జిల్లాలో ఉన్న 19 సీట్లలో వైసీపీకి టఫ్ ఫైట్ ఇస్తుంది. అదే సమయంలో నెక్స్ట్ జనసేనతో పొత్తు ఉంటే…తూర్పులో మెజారిటీ సీట్లు టీడీపీవే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటు ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీ చాలా వరకు పుంజుకుంది. జిల్లాలో ఉన్న 12 సీట్లలో సగం సగం అనే పరిస్తితి ఉంది. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ మూడు జిల్లాలు మళ్ళీ టీడీపీకి కలిసొచ్చేలా ఉన్నాయి.
ReplyForward |
Discussion about this post