ప్రకాశం జిల్లాలో టీడీపీ దూకుడు మీద ఉంది…జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ వేగంగా పికప్ అవుతుంది. అసలు గత ఎన్నికల్లోనే ప్రకాశం జిల్లాలో టీడీపీ పరువు నిలబడిందనే చెప్పాలి. అన్నీ జిల్లాల్లో దారుణంగా ఓడిపోయినా సరే ప్రకాశంలో మాత్రం టీడీపీకి నాలుగు సీట్లు వచ్చాయి. మధ్యలో కరణం బలరాం లాంటి సీనియర్ నేత పార్టీని వీడినా సరే పార్టీకి ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ లాంటి వారు పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు.

ఈ రెండున్నర ఏళ్లలో జిల్లాలో ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పికప్ అయింది. అసలు వైసీపీకి అనుకూలంగా ఉన్న దర్శిలో సైతం టీడీపీ సత్తా చాటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దర్శి మున్సిపాలిటీ గెలుచుకోవడంతో జిల్లాలో టీడీపీకి కొత్త ఊపు వచ్చింది. అసలు రెండున్నర ఏళ్ల కాకముందే…పలు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిపోతున్నారు. అంటే అప్పుడే జిల్లాలో పరిస్తితి ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు.ఇదే పరిస్తితి వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే….నెక్స్ట్ ప్రకాశంలో టీడీపీ అదిరిపోయే విజయాలని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా గత 20 ఏళ్లుగా విజయానికి దూరమైన పలు నియోజకవర్గాల్లో టీడీపీ గెలవడం సులువు అనే పరిస్తితి వచ్చింది. అసలు సంతనూతలపాడు, గిద్దలూరు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచి…20 ఏళ్ళు దాటేసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ చివరిగా గెలిచింది…1999 ఎన్నికల్లోనే మళ్ళీ ఆ రెండు చోట్ల పార్టీ గెలవలేదు.

2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే వస్తుంది. అయితే ఈ సారి మాత్రం టీడీపీకి బాగా కలిసోచ్చేలా ఉంది..రెండు చొట్లా ప్రజలు రివర్స్ అయ్యే పరిస్తితి వచ్చింది. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు టీడీపీలో చేరిపోతున్నారు. సంతనూతలపాడు ఇంచార్జ్ విజయ్ కుమార్, గిద్దలూరు ఇంచార్జ్ అశోక్ రెడ్డిలు దూకుడుగా పనిచేస్తూ…వైసీపీని దెబ్బకొట్టేలా ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ రెండు చోట్ల సైకిల్ సవారికి మంచి ఛాన్స్ ఉంది.
Discussion about this post