ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానంగా అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న చీరాలలో కాస్త పరిస్తితులని జగన్ చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు. చీరాల సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని చెప్పి..వీరు పోటాపోటిగా చీరాలలో రాజకీయం చేస్తున్నారు. దీంతో ఆధిపత్య పోరు మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఆమంచిని తాజాగా పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పంపిన విషయం తెలిసిందే.


ఇక తాజాగా ఆయన పర్చూరు బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆమంచి పర్చూరు నుంచి పోటీ చేస్తారని టాక్. అయితే టీడీపీ కంచుకోటగా ఉన్న పర్చూరులో వైసీపీని నిలబెట్టడం ఆమంచికి సాధ్యమేనా? అంటే కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే పర్చూరులో టీడీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ గా ఉన్నారు. పైగా ఈయనకు కమ్మ వర్గంతో పాటు కాపు వర్గంలో ఫాలోయింగ్ ఉంది.

అటు ఇంతకాలం పర్చూరులో వైసీపీ బాధ్యతలు చూసుకున్న రావి రామనాథం బాబుని ఇప్పుడు సైడ్ చేశారు. ఆయన కమ్మ వర్గం నేత.దీంతో కమ్మ వర్గం ఇంకా వైసీపీకి దూరమయ్యే ఛాన్స్ ఉంది. అటు ఆమంచి కాపు నేత..అలా అని కాపు వర్గమంతా వైసీపీకి సపోర్ట్ చేయడం కష్టం. ఎందుకంటే నెక్స్ట్ టీడీపీతో జనసేనకు పొత్తు ఉంటుంది. దీంతో కాపు ఓట్లు కూడా డౌటే. అన్నీ రకాలుగా పర్చూరులో ఆమంచికి అడ్డంకులు కనిపిస్తున్నాయి. కాబట్టి టీడీపీ కంచుకోటని కైవసం చేసుకోవడం అంత ఈజీ కాదనే చెప్పాలి.

Leave feedback about this