ఏపీలో అధికార వైసీపీ…ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడే ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి నేతలు…వైసీపీపై ఫుల్ ఎటాక్ చేస్తున్నారు. తమదైన శైలిలో వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి నేతల విమర్శలకు వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పరుష పదజాలం వాడుతూ రెచ్చిపోతున్నారు. అలాగే మరికొందరు విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో తడబడి వారే బుక్ అయిపోతున్నారు.

ఇప్పుడు ఏపీలో మంత్రి పేర్ని నానిది అదే పరిస్తితి…ఇటీవల హెరాయిన్ కంటైనర్ ఒకటి పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి నేతలు, వైసీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పేర్ని నాని దీనిపై స్పందిస్తూ..బెజవాడలో భూ కబ్జాలు చేసే వీళ్ళు…డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారని, హెరిటేజ్ వ్యాన్‌ల్లో ఎర్రచందనం దుంగల్ని జపాన్ తరలించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

అంటే హెరిటేజ్ వ్యాన్‌లో జపాన్ వెళ్లిపోతారా? అనే విషయం కూడా మంత్రిగా అవగాహన లేకపోవడంపై టిడిపి నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ముఖ్యంగా నాని ప్రత్యర్ధి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఓ రేంజ్‌లో నానీపై సెటైర్లు వేస్తున్నారు. ఎలాగో రవాణా శాఖ మంత్రి కాబట్టి…జపాన్ ఒక ఆర్టీసీ బస్ వేయాలని ఎద్దేవా చేస్తున్నారు. అసలు మెరిసేదంతా బంగారం కాదని, నాని చెప్పేవన్నీ నిజాలు కాదంటూ…కొల్లు ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేస్తున్నారు.

అలాగే బందరు పోర్టుని కట్టకుండా కాలయాపన చేస్తున్నారని, అదానీకి పోర్టు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అవుతున్నారు. అలాగే పోర్టు కోసం గత టిడిపి ప్రభుత్వం హయాంలో రైతుల దగ్గర నుంచి భూములు సమీకరిస్తే…ఆ భూములు ఏవో సొంతంలాగా వైసీపీ నేతలు పంటలు పండించుకుంటున్నారని, అందులో బుసకని యధేచ్చగా తవ్వుకుని తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ మంత్రిని మాజీ మంత్రి టార్గెట్ చేసి ర్యాగింగ్ చేసేస్తున్నారు.

Discussion about this post