2014లో కర్నూలులో అనూహ్యమైన స్థానాలు గెలుచుకుని.. అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 వచ్చేసరికి గ్రాఫ్ పూర్తిగా పడిపో యింది. మొత్తం ఈజిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే.. గత మూడేళ్లలో చంద్రబాబు ఇక్కడ ఏమైనా దృష్టిపెట్టారా? అంటే లేదు. కానీ, క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం పార్టీని బలోపేతం చేసుకునేదిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒకవైపు.. చాపకింద నీరులా.. కేఈ వర్గం.. మరోవైపు.. కోట్ల వర్గం ప్రజలను కలుస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ నుంచి వచ్చే నాయకులకు ఆహ్వానం పలుకుతున్నారు. దీంతో టీడీపీకి ఇప్పుడు ఆశావహ జిల్లాగా మరోసారి కర్నూలు మారుతోందనే టాక్ వినిపిస్తోంది.

ఇటీవల కోడుమూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన తర్వాత.. జిల్లాలో టీడీపీ నేతలు ఉత్సాహంతో ముందుకు కదులుతు న్నారు. కోడుమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్తిగా పోటీ చేసిన జె. సుధాకర్ బాబు తమ్ముడు సుదర్శన్ తాజాగా టీడీపీలోకి వచ్చారు. అంతేకాదు.. వైసీపీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో పనిచేసేవారికి ప్రాధాన్యం లేదని.. పార్టీని తమ కుటుంబం భుజాన మోసిందని.. అయినా.. ఎలాంటి గుర్తింపు కూడా పార్టీలో లభించడం లేదని.. అన్నారు.

అయితే.. నిజానికి ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ ఖండించాలి. లేదా.. తన తమ్ముడికి .. తనకు ఏమీ సంబంధం లేదని.. రాజకీయాలు ఎవరికివారివే అని చెప్పాలి. కానీ,ఆయన సైలెంట్‌గా ఉన్నారు. దీంతో ఇతర నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేతలను టీడీపీ వైపు ఆకర్షించే పనివేగవంతంగా సాగుతోంది. కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు కూడా పత్తికొండ నియోజకవర్గంలో దూకుడుగా తిరుగుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన బయటకు రాలేదు. కానీ… ఇటీవల కాలంలో ఆయన వైసీపీ ఆగడాలను బాగానే ప్రశ్నిస్తున్నారు.

ఇక, మరోవైపు.. కేఈ తమ్ముళ్లు కూడా దూకుడుగా ఉన్నారు. దీంతో అటు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, ఇటు కేఈ కుటుంబాల రాజకీయంతో వైసీపీ కార్యకర్తలు.. సైకిల్ ఎక్కేస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే దాదాపు వంద మంది కీలక కార్యకర్తలు.. కోట్ల, కేఈల సమక్షంలో ..సైకిల్ ఎక్కేశారు. ఈ పరిణామాలను గమనించిన వారు.. టీడీపీకి మళ్లీ పునర్ వైభవం ఖాయమని అంటున్నారు.

Discussion about this post