గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపి చాలా నియోజకవర్గాల్లో భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో దారుణంగా డ్యామేజ్ జరిగింది. జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి నష్టం..వైసీపీకి లాభం జరిగింది. అయితే జనసేన వల్ల కొన్ని సీట్లలో టిడిపి మూడో స్థానానికి కూడా పరిమితమైంది. అలా మూడో స్థానానికి పరిమితమైన స్థానాల్లో నరసాపురం అసెంబ్లీ కూడా ఒకటి.
కాపు, ఎస్సీ, మత్స్యకార వర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న నరసాపురంలో టిడిపి మూడో స్థానంలో నిలిచింది. ఇక వైసీపీ 55 వేలు ఓట్లు తెచ్చుకుని గెలిచింది. జనసేనకు 49 వేల ఓట్లు పడ్డాయి..ఆ పార్టీ సెకండ్ స్థానంలో నిలిచింది. ఇటు టిడిపికి కేవలం 27 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే ఇక్కడ జనసేన ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే గతంలో నరసాపురంలో టిడిపి సత్తా చాటింది. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు నరసాపురంలో టిడిపి గెలిచింది. 2009లో ఓడిపోగా, 2014లో మళ్ళీ గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడింది.

అయితే అన్నీ సార్లు గెలిచిన సరే గత ఎన్నికల్లో టిడిపికి దారుణంగా ఓట్లు పడ్డాయి. అంటే అక్కడ మొదట నుంచి మద్ధతుగా ఉన్న కాపు, మత్స్యకార వర్గాలు..జనసేన వైపుకు వెళ్ళాయి. దీంతో టిడిపికి భారీగా ఓట్లు తగ్గాయి. ఇక ఇప్పటికీ అక్కడ టిడిపి మూడో స్థానంలోనే ఉంది. కొద్దిగా బలం పెరిగింది ఏమో గాని..ఇంకా జనసేన బలం పెరగడం వల్ల టిడిపికి ఛాన్స్ లేకుండా పోయింది.
మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీకే లాభం. అలా కాకుండా టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓటమి ఖాయం. పొత్తు ఉంటే ఖచ్చితంగా ఈ సీటు జనసేనకే అని చెప్పవచ్చు.