దాదాపు మూడేళ్ల తర్వాత.. మహానాడు నిర్వహించారు. 2019లో ఎన్నికల సమయంలో హడావుడి అవుతుందని భావించిన టీడీపీ.. అప్పట్లో మహానాడును నిర్వహించలేదు. గెలిచిన తర్వాత.. అంబరమంటి సంబరాలు చేసుకుని.. అప్కుడు మహానాడు ను నిర్వహించుకుందామని అనుకున్నారు. అయితే.. గెలవలేదు. ఇక, 2020, 2021 నాటికి రాష్ట్రంలో కరోనా విజృంభించింది. దీంతో ఆన్‌లైన్‌లోనే మహానాడు నిర్వహించి మమ అనిపించారు. ఇక, ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా.. మహానాడును నిర్వహించారు. దీనికి కారణం..ప్రకాశంలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఉండడం. వీరిలో ఒకరు వెళ్లిపోయినా.. పార్టీకి కేడర్ బాగుందని అనుకోవడంతో ఇక్కడ నిర్వహించారు.

ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. మహానాడుకు ఆశించిన విధంగా విరాళాలు రాలేదు. నిజానికి 2018లో నిర్వహించిన మహానాడులో 15 కోట్ల వరకు విరాళాలు వచ్చాయి. అంతుకు ముందు 12 కోట్ల రూపాయలు వచ్చాయి. అయితే.. 2019లో ఎలానూ.. నిర్వహించకపోయినా.. ఆన్‌లైన్‌లో కోటి రూపాయల వరకు విరాళాలు వచ్చాయని ఒక లెక్క ఉంది. అయితే.. తాజాగా మహానాడులో మాత్రం విరాళాల లెక్క తప్పింది. భారీ స్తాయిలో గత మూడేళ్ల కిందట కోటి రూపాయలు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. తర్వాత.. వరుసలో 50 లక్షలు.. కూడా ఇచ్చినవారు పదుల సంఖ్యలో ఉన్నారు.

పోనీ.. అప్పట్లో అధికారంలో ఉన్నారు కనుక ఇచ్చారను కున్నా.. ఇప్పుడు మరీ నాసిరకంగా విరాళాలు వచ్చాయి. కేవలం ఓ నలుగురు ఐదుగురు మాత్రమే 25 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. మిగిలిన వారిలో 5 లక్షలు.. రూ.1 లక్ష చొప్పున విరాళాలు ఇచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఎందుకు.. ఇలా జరిగింది? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పనులు ముందుకు సాగడం లేదు. టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న వ్యాపారాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అదేసమయంలో కరోనా ప్రభావం కూడా పారర్టీ నేతల వ్యాపారాలపై పడింది. దీంతో విరాళాలు భారీగా తగ్గిపోయాయనే ఒక అంచనా ఉంది.

ఇదిలావుంటే.. మరో కోణం కూడా ఉందనే గుసగుస వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి.. భారీ ఎత్తున పోటీ ఉండే అవకాశం ఉందని.. అప్పటికి పోటీ తీవ్రత పెరిగి.. అధికార పార్టీ నాయకులతో పోటీ పడాలంటే.. చేతినిండా డబ్బులు ఉండాల్సిన అవసరం ఉందని.. చాలా మంది నాయకులు ముందు జాగ్రత్త పడుతున్నారనే గుసగుస కూడా మహానాడులో వినిపించింది. అందుకే చాలా మంది కేవలం లక్ష, రెండు లక్షలతో సరిపెట్టారని.. అంటున్నారు. ఇక, మరికొందరు తమకు టికెట్ రాకపోతే.. పరిస్థితి ఏంటి? అప్పుడు… ఏదైనా డబ్బులు అవసరం అయితే.. ఏంటనే ఉద్దేశంతో మిన్నకున్నారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా.. విరాళాల విషయంలో మహానాడు నిరాశ పరిచిందనే టాక్ వినిపిస్తోంది.
Discussion about this post