టీడీపీలో ఇంకా చాలామంది యాక్టివ్ కావాల్సింది…గత ఎన్నికల దెబ్బకు చాలామంది నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. కొందరు వేరే పార్టీల్లోకి వెళ్లిపోతే..మరికొందరు రాజకీయాల్లోనే కనిపించడం లేదు. అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయినా సరే..ఇంకా కొందరు మాత్రం టీడీపీలో కనిపించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఈ క్రమంలోనే అరకులో టీడీపీ పరిస్తితి ఏమి బాగోలేదు. ఇక్కడ టీడీపీ బాధ్యతలు చూసుకుంటే కిడారి శ్రావణ్ ఏమైపోయారో..ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది.

మామూలుగా అరకు ప్రాంతం టీడీపీకి పెద్దగా అనుకూలంగా ఉండదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలోకి రావడం.. ఆ తర్వాత మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తనయుడు శ్రావణ్‌ని పార్టీలోకి తీసుకొచ్చి చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. 6 నెలల పాటు పదవిలో కొనసాగి, ఆతర్వాత రాజీనామా చేసి…2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి శ్రావణ్ పోటీ చేశారు.

అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే…అరకులో ఇంకా ఘోరంగా టీడీపీ ఓడిపోయింది. శ్రావణ్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఓడిపోయాక శ్రావణ్ సైలెంట్ అయ్యారు. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించారు గానీ…గత కొన్ని నెలల నుంచి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆయన పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు.

శ్రావణ్ పార్టీలో యాక్టివ్ గా లేకపోవడం వల్ల అరకులో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఇప్పటికే రెండున్నర ఏళ్ళు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కూడా ఇదే పరిస్తితి కొనసాగితే అరకుని టీడీపీ వదిలేసుకోవాల్సిందే. అందుకే శ్రావణ్‌ని యాక్టివ్ అయ్యేలా చేయాలి..లేదంటే అరకులో మరో బలమైన నేతలకు పగ్గాలు ఇవ్వాలి…లేకపోతే అరకులో టీడీపీ అస్సామే.

Discussion about this post