రాజకీయాల్లో నేతలు చేసే కామెంట్లు ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. నేతలు చేసే కామెంట్లు.. ఆసక్తిగా మారుతా యి. అయితే.. కొన్ని కొన్ని విషయాలు… సీరియస్‌గా ఉంటే.. మరికొన్ని విషయాలు మాత్రం `విషయం` లేకపోయినా.. ఇంట్రస్టింగ్‌గా మాత్రం ఉంటాయి. ఇలాంటి ఒక అంశంపైనే.. వైసీపీలో ఆసక్తికర చర్చ సాగు తోంది. ఇటీవల టీడీపీ విజయవాడ నాయకుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై విరుచుకుపడ్డా రు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంపై వైసీపీలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆయన ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు.

రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు చెప్పింది. ఇక్కడే కొనసాగించాలని.. దీనిపై చట్టం చేసే హక్కు రా ష్ట్ర శాసన సభకు లేదని పేర్కొంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి కొంత లేటుగా రియాక్షన్లు వచ్చాయి. కానీ, టీడీపీ నుంచి మాత్రం రాజధానికి అనుకూలంగా.. వ్యాఖ్యలు వినిపించాయి. ఈ క్రమంలో చాలా మంది నాయకులు విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలపై కామెంట్లు చేశారు. ఇలా.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ కీలక సలహాదారుపై ఆసక్తికర కామెంట్లు చేశారు. దీనిపైనే ఇప్పుడు వైసీపీ నేతల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం.

వెంకన్న ఏమన్నారంటే.. “అవకాశం ఉంటే.. చిలకలూరిపేటలో కూడా రాజధాని ఏర్పాటు చేసుకుంటారే మో!“ అని వ్యాఖ్యానించారు. అయితే… వాస్తవానికి.. చిలకలూరిపేటకు.. వైసీపీ నేతలకు మధ్య ఉన్న సం బంధం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి నిప్పులేనిదే పొగరాదు కదా.. అక్కడ ఏం జరుగుతోంది? చిలకలూరిపేట ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుంది..? ఆ నేతకు చిలకలూరి పేటకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అనే అనేక ప్రశ్నలు వైసీపీ నేతల మధ్య ఆసక్తిగా మారాయి.అయితే.. ఎవరూ కూడా దీనికి కంక్లూజన్ ఇవ్వకపోవడం గమనార్హం. నేతలు అయితే.. చిలకలూరిపేటపై ఆసక్తిగానే చర్చ జరుపుకోవడం గమనార్హం.

Discussion about this post