రాజకీయాల్లో మార్పులు సహజం. అవసరం.. ఎటు ఉంటే అటు.. అవకాశం ఎలా ఉంటే.. అలా అడుగులు వేయాల్సిన పరిస్తితి నెలకొంది. సమయానికి తగిన విధంగా రాజకీయాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా అలా అడుగులు వేయకతప్పని పరిస్థితి నెలకొంది. నిజానికి పార్టీలో సంస్థాగతంగా అనేక మంది నాయకులు ఉన్నారు. వారిని ఏకతాటిపై నడిపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. పార్టీ ఓడినా .. గెలిచినా.. ఎప్పుడూ.. కార్యకర్తలనే అండగా భావించింది.

ఈ క్రమంలో అనేక మంది పార్టీలో ఎదిగారు.. జెండా పట్టుకున్న స్థాయి నుంచి మైకు అందుకుని పార్టీ తరఫున గళం విప్పుతున్న నాయకుల వరకు ఎంతో మంది ఉన్నారు. వీరంతా కూడా .. తమకు పదవులు దక్కుతాయని.. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుదామని ఆశలు పెట్టుకున్నారు. దీనిని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఉన్నత చదువులు ఎందుకు చదువుతారు.. ఉన్నత ఉద్యోగం కోసమే కదా! అలానేపార్టీలో ఒక్కొక్క మెట్టు ఎందుకు ఎక్కుతారు.. అంటే.. పదవులు దక్కించుకోవడం కోసమే.

సో.. కాబట్టి నేతల ఆశలు తప్పుకాదు. అయితే.. ఇటు పార్టీ పరంగా చూసుకుంటే.. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మారక తప్పడంలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో పొత్తులు అనివార్యంగా మారాయి. పలితంగా రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 50 స్థానాల వరకు పొరుగు పార్టీలకు పంచి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా.. ప్రస్తుతం టికెట్‌లపై ఆశలు పెట్టుకున్న నేతలు తల్లడిల్లుతున్నారు. ఇన్నాళ్లు తాము పడ్డ కష్టం వృథాయేనా.. అని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు వీరికి నచ్చజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. పార్టీకి పునాదులు వీరే. కాబట్టి.. వీరికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఉంటుందని.. ముందు పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కృషి చేయాలని.. ఆదిశగా చంద్రబాబు దిశానిర్దేశం చేయాలని పరిశీలకులు సూచిస్తున్నారు. అంతేకాదు, నిరుత్సాహం.. లేకుండా ఎప్పటికప్పుడు కార్యకర్తల్లోనూ.. పార్టీ టికెట్లుఆశిస్తున్న వారిలోనూ భరోసా నింపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Discussion about this post