ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య జంపింగులు పెద్దగా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. గతేడాది కాస్త జంపింగులు ఎక్కువగానే జరిగాయి గానీ, ఈ ఏడాది ఎక్కువగా లేవు. ప్రతిపక్ష టీడీపీ నుంచి వలసలు పెద్దగా జరగడం లేదు. ఈ మధ్య ఎందుకో వలసలకు ఫుల్ బ్రేక్ పడిపోయింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన మొదట్లో మాత్రం కాస్త జంపింగులు ఎక్కువగానే జరిగాయి. కొంతమంది టీడీపీ నేతలు బీజేపీలోకి వెళ్ళగా, మరికొందరు వైసీపీలోకి వెళ్లారు.

అలాగే నలుగురు ఎమ్మెల్యేలు సైతం వైసీపీ వైపుకు వెళ్లారు. ఇక అంతే ఆ తర్వాత వలసలకు బ్రేక్ పడింది. అయితే టీడీపీ నుంచి ఇంకా వలసలు ఉంటాయని ప్రచారం జరిగింది గానీ..అది జరగలేదు. పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం వచ్చింది గానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లలేదు. ఒక్క గంటా శ్రీనివాసరావు వ్యవహారమే క్లారిటీ లేదు గానీ, మిగిలిన ఎమ్మెల్యేలు టీడీపీతోనే ఉంటారని అర్ధమవుతుంది.

అలాగే టీడీపీ నేతలు కూడా వైసీపీలోకి అవకాశాలు కనిపించడం లేదు. ఇలా వలసలకు బ్రేక్ పడటానికి కారణాలు లేకపోలేదు. ఎలాగో వైసీపీకి ఫుల్ మెజారిటీ ఉంది…అక్కడకు వెళ్ళిన వేరే పదవులు ఏమి రావు…పైగా ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి…నిధులు అనుకున్న మేర రావు..కాకపోతే ఏమన్నా కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చిన పెద్దగా ఉపయోగం లేదు. అన్నిటికంటే వైసీపీ పాలన పట్ల ప్రజలు అంత సంతృప్తిగా ఏమి లేరు.

ఏదో వైసీపీ అధికార బలం ఉపయోగించుకుని స్థానిక ఎన్నికలు గెలుస్తుంది తప్ప, పూర్తిగా ప్రజలని మెప్పించి గెలవడం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలు తమవైపే ఉన్నారని వైసీపీ అనుకుంటుంది…కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్తితి లేదు. జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ విషయం అందరికీ అర్ధమవుతుంది. అందుకే టీడీపీ నుంచి వలసలు లేవని చెప్పాలి. ఇక ఉంటే ఎన్నికల ఉండే పరిస్తితులు బట్టి ఉండొచ్చు.

Discussion about this post