సాధారణంగా ఒక పార్టీలో ఏదైనా సీక్రెట్ ఉంటే… ఆ పార్టీలోనే పరిమితం కావాలి. అందునా.. కొందరు అగ్ర నేతల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అయితే… టీడీపీలో తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆ పార్టీ జరుగుతున్న పరిణామాలు మాత్రం వైసీపీ నేత చేతిలోకి వెళ్లిపోతున్నాయి. అంతేకాదు.. అక్కడి నుంచి టీడీపీ నేతలకు చేరుతున్నాయి. ఇదెలా సాధ్యం ? అని అనుకుంటున్నారా ?.. ఒకింత చిత్రంగానే ఉన్నా… ఇది సాధ్యమనే అంటున్నారు చీరాలకు చెందిన మాజీ టీడీపీ నాయకులు..! గతంలో చంద్రబాబుకు అత్యంత విధేయుడిగా ఉన్న ఒక కీలక నేత వ్యవహారంపై ఇప్పుడు చీరాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

హార్డ్ కోర్.. టీడీపీ నేత అయిన ఆయన.. దాదాపు 40 ఏళ్లపాటు.. ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే.. గత ఎన్ని కల్లో గెలిచిన తర్వాత.. వ్యక్తిగత విషయాలు లేదా వ్యాపార అంశాలు, కొడుకు భవిష్యత్తు నేపథ్యంలో వైసీపీ లోకి వచ్చారు. అయితే.. ఇలా పార్టీ మారడం తప్పుకాదు. కానీ, అప్పటితో.. అప్పటి వరకు ఉన్న పార్టీకి సంబంధించిన విషయాలు కట్ అయిపోవాలి. కానీ, ఇక్కడ మాత్రం ఎలాంటి బంధం కట్ కాలేదు. పైగా.. టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లోనూ.. కొన్నాళ్ల కిందట.. వరకు కూడా ఈ విషయం వివాదంగానే ఉంది.

దీనిపై సోషల్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే.. తర్వాత అయినా.. వెనక్కి తగ్గారా? అంటే అది కనిపించడం లేదు. పైగా మనిషిగా వైసీపీలో ఉన్నా..సదరు నాయకుడి.. మనసంతా మాత్రం టీడీపీలో ఉందనే ప్రచారం ఉంది. ఇదిలావుంటే.. చీరాల టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న నాయకుడికి.. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ నాయకుడికి.. ఆయన వారసుడికి కూడా ఎక్కడా సంబంధం కట్ కాకపోవడం గమనార్హం.

ఈ క్రమంలో టీడీపీలో ఏం జరిగినా.. ముందుగా.. సదరు వారసుడికే తెలిసిపోతోందట. వాస్తవానికి ఇంచార్జ్‌గా ఉన్న నాయకుడికి తెలియాలి. లేదా.. ఆ పార్టీలో ఉన్న నేతలకు తెలియాలి. కానీ.. ఇక్కడ మాత్రం ఫుల్ రివర్స్. వైసీపీలోకి జంప్ చేసిన నాయకుడికి తెలుస్తోంది. ఇక, ఇక్కడ నుంచి టీడీపీ నేత ఫోన్‌కు సమాచారం చేరుతోందట. ఏదో నియోజకవర్గ, జిల్లా స్థాయి విషయాలు కాదు.. చివరకు రాష్ట్ర టీడీపీలో కీలక నేతల మధ్య ఉండాల్సిన సీక్రెట్లు కూడా సదరు మాజీ టీడీపీ నేతకు చేరడం.. ఆయన ద్వారా జిల్లాలో టీడీపీ నేతలకు చేరడమే ఇక్కడ విడ్డూరం.

ఇదే విషయం ఇప్పుడు చీరాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక పార్టీలో ఉంటూ.. మరో పార్టీకి అనుబంధంగా పనిచేయొచ్చా? అనేది కీలక ప్రశ్న. అంతేకాదు.. వైసీపీ నేతలు ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తున్న టీడీపీతో పరిచయం అవసరమా ? అనేది కూడా ప్రశ్న. ఇలాంటి పరిణామాలను గమనిస్తే.. వీరు నిజంగానే వైసీపిని నమ్మి వచ్చారా ? లేక.. తమ అవసరం కోసం వచ్చారా? అనే ప్రశ్నలు కూడా తెరమీదికి వస్తున్నాయి.

రేపు.. అవకాశం వస్తే.. మళ్లీ టీడీపీలోకి వెళ్లిపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి వారిని నమ్మితే.. పార్టీకి కూడా ప్రమాదమని.. వైసీపీకి కొందరుసూచిస్తుండడం గమనార్హం. మరి దీనిపై అధికార పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అటు టీడీపీ వాళ్ల సీక్రెట్స్ కూడా వైసీపీ వాళ్లకు లీక్ అవ్వడంతో ఆ పార్టీ నేతలు కూడా సదరు నేత డబుల్ గేమ్‌పై పార్టీ కీలక నేతలకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.

Discussion about this post