పార్టీలో కష్టపడే వారికి పదవులు ఖాయం! ఈ మాట టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా చెబుతున్నారు. ఇదే నిజమైతే.. వారికి పదవులు ఖాయమే .. అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ఆయా వర్గాలను పార్టీకి చేరువ చేయడంలోనూ..వారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. వారే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు.. వర్ల రామయ్య, మాజీ మంత్రి కేఎస్ జవహర్. పార్టీలో నిత్యం వీరి గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.


జగన్ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపడంలోను, ప్రజల తరఫున బలమైన గళం వినిపించడంలోనూ.. మాజీ మంత్రి కేఎస్ జవహర్.. తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. అంతేకాదు.. ప్రతి విషయంలోనూ.. ఆయన సై అంటే సై అన్నట్టుగా.. సవాళ్లు సైతం విసురుతున్నారు. ఇక, 151 మంది ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉన్నప్పటికీ.. కేఎస్ జవహర్ వాయిస్‌కు దీటుగా సమాధానం చెప్పే నాయకులు ఒక్కరు కూడా లేక పోవడం.. ఈ పార్టీలో ఉన్న ఉదాసీనతకు నిలువుటద్దంగా నిలిచిందనేది వాస్తవం.

ఇక, వర్ల రామయ్య. ప్రస్తుతం .. ఈయన పార్టీ పొలిట్ బ్యూరో.. సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఈ సింపతీ ఆయనపై ఉంది. దీనికి తోడు.. పోలీసుల వైఖరిపై తరచుగా ఆయన లేఖలు సంధించడంతో పాటు.. బడుగు వర్గాల పక్షాన ఆయన వాయిస్ వినిపిస్తున్నారు. అదేసమయంలో పార్టీ కష్టకాలంలో ఉన్నా.. ఆయన బలంగా తన వాయిస్ వినిపించడంతోపాటు.. ఎస్సీ సామాజిక వర్గాన్ని పార్టీకి చేరువ చేయడంలోనూ.. ముందున్నారు.

దీంతో ఈ ఇద్దరి విషయంలో చంద్రబాబు చాలా పాజిటివ్‌గా ఉన్నారని.. వర్ల లేదా.. కేఎస్‌లలో ఒకరికి ఖచ్చితంగా ఎస్సీ కోటాలో డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వడం ఖాయమని అంటున్నారు. వర్ల ఒకవేళ పోటీ చేయకపోయినా.. ఆయనను మండలికి పంపించి.. మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇక, కేఎస్ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపుగుర్రం ఎక్కుతారని.. చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి రావడం గమనార్హం.

Discussion about this post