రెడ్డి సామాజికవర్గం మెజారిటీ వైసీపీ వైపే ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో వన్ సైడ్ గా వైసీపీకి ఓట్లు వేశారు. అందుకే రాయలసీమ లాంటి ప్రాంతంలో వైసీపీ భారీ విజయం అందుకుంది. అలాంటి విజయాన్ని అందించిన రెడ్డి వర్గానికి వైసీపీ చేసిందేమి కనబడటం లేదు. ఏదో కొంతమంది రెడ్డి నేతలు బాగుపడటం తప్ప..ఆ వర్గానికి ఒరిగింది ఏమి లేదు. ఈ క్రమంలో రెడ్డి వర్గంలో మార్పు కనిపిస్తుంది. ఈ సారి వన్ సైడ్ గా వైసీపీ వైపుకు వెళ్ళడం కష్టం.
కొందరు టిడిపి వైపు కూడా చూస్తున్నారు. ఈ క్రమంలోనే సీమ లాంటి చోట్ల టిడిపి కొన్ని స్థానాల్లో గెలుపు దిశగా వెళుతుంది. అలా గెలుపు వైపుగా వెళుతున్న సీట్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానపల్లి ఒకటి. 2008లో ఏర్పడిన ఈ స్థానంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి కాటసాని రామిరెడ్డి గెలిచారు. 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి బీసీ జనార్ధన్ రెడ్డి గెలిచారు.2019 ఎన్నికలకొచ్చేసరికి వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డి గెలిచారు.

ఇక ఎమ్మెల్యేగా రామిరెడ్డి అనుకున్న విధంగా బనగానపల్లిలో అభివృద్ధి చేయలేదు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా కాస్త విఫలమయ్యారని తెలుస్తుంది. ప్రభుత్వ పథకాలు తప్ప..అక్కడ ప్లస్ లేదు. కానీ గతంలో బీసీ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. దీంతో ప్రజలు మళ్ళీ బీసీ వైపు చూస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర సైతం బనగానపల్లిలో సక్సెస్ అయింది. దీంతో బనగానపల్లిలో టీడీపీకి ఆధిక్యం కనిపిస్తుంది. ఈ సారి ఎన్నికల్లో బంగానపల్లి జనార్ధన్ రెడ్డి టిడిపి జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పవచ్చు