ఇటీవల వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ నాయకులతో మేధో మధన సమావేశం నిర్వహించారు. పార్టీ విషయంలో ఎలా ముందుకు సాగాలి.. నేతలు ఎలా వ్యవహరించాలి.. ముఖ్యంగా గడపగడపకు.. ప్రభు త్వం కార్యక్రమంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలో ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీగురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలే అత్యంత కీలకమైనవని చెప్పారు. దీనికి కారణం.. వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు యాక్టివ్ గా ఉంటారని అన్నారు.

తర్వాత.. వచ్చే ఎన్నికల అనంతరం..చంద్రబాబు వృద్ధుడు అయిపోతారని.. 2029 ఎన్నికల నాటికి.. ఆ యన పోటీ చేసే పరిస్థితి ఉండదు.. పైగా పార్టీని నడిపించే వారు కూడా ఉండరని.. జగన్ వ్యాఖ్యానించా రు. అంటే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తే.. ఇక, తర్వాత..తమకు తిరుగులేదని.. టీడీపీ ఉండే అవకాశం కూడా లేదని.. జగన్ ముక్తాయించారు. మరి ఇదేనిజమా? చంద్రబాబు లేకుంటే.. ఇక, పార్టీ లేనట్టేనా? అనేది ఇప్పుడు జరుగుతున్న కీలక చర్చ

వాస్తవానికి చంద్రబాబుకు ముందు… తర్వాత కూడా టీడీపీ ఉంది. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదమే ఆయువు పట్టుగా.. పుట్టిన పార్టీ.. అనేక ఉత్థాన పతనాలను చవి చూసింది. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీ య ప్రస్తానంలో అనేక గెలుపు.. అంతకుమించిన ఓటములు కూడా పార్టీ చవి చూసింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 27 స్థానాలకు పరిమితమైనా.. అనూహ్యంగా పుంజుకున్నా.. టీడీపీ వెనుక.. నాయకుల కన్నా..కార్యకర్తలు ఉన్నారు. వారిని మించిన తెలుగు వారి అభిమానం ఉంది.

అందుకే.. నాయకులు లేకున్నా.. కార్యకర్తలే.. పార్టీని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్క డ యువత, కార్యకర్తలు.. పెద్ద ఎత్తున పార్టీని మోస్తున్నారు. ప్రతి విషయంలోనూ.. నడిపిస్తున్నారు. ఇది చంద్రబాబు ఉంటేనే జరుగుతుంది.. ఆయన పక్కకు తప్పుకొంటే.. పార్టీ లేదు.. అనే మాట వృథా. టీడీపీ వ్యవస్థీకృతంగా ఏర్పడిన పార్టీ. ఏ ఒక్కరిపైనో ఆధారపడిందో.. కాదు. సో.. ఈ రోజు చంద్రబాబు ఉన్నా.. రేపు ఆయన వృద్ధాప్యంతో పక్కకు తప్పుకొన్నా.. తెలుగు ప్రజలే పార్టీని నడిపిస్తారనే నిజం .. జగన్ తెలుసుకోవాలని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post