రాష్ట్రంలో ఊహించని విధంగా రాజకీయం మారుతుంది….ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా నడిచిన రాజకీయం…ఇక నుంచి టీడీపీకి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అనూహ్యంగా వైసీపీపై వ్యతిరేకత పెరగడం, టీడీపీకి బాగా ప్లస్ అవుతుంది…టీడీపీ ఇంకాస్త కష్టపడితే వైసీపీకి చెక్ పెట్టి అధికారం దకించుకోగలదు…ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీకి పోటీగా టీడీపీ పుంజుకుంది..మరి కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీని దాటి టీడీపీ లీడ్ లోకి వస్తుంది.

ఇక సిట్టింగ్ సీట్లలో టీడీపీ ఇంకా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది..వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సిట్టింగ్ సీట్లలో టీడీపీ సత్తా చాటేలా ఉంది..ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న నాలుగు సీట్లలో టీడీపీ బలంగానే కనబడుతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, పెద్దాపురం సీట్లని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ సిట్టింగ్ సీట్లలో బలం పెంచుకోవాలని చూసింది…కానీ ఆ పని జరగలేదు.ఇప్పటికీ ఆ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగానే కనిపిస్తోంది. ఏదో అధికార బలంతో స్థానిక ఎన్నికల్లో గెలిచింది గాని, క్షేత్ర స్థాయిలో చూస్తే టీడీపీ బలం ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి ఫ్యామిలీ బలంగానే ఉంది..వచ్చే ఎన్నికల్లో ఆదిరెడ్డి భవాని బదులు..ఆమె భర్త శ్రీనివాస్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇక్కడ వైసీపీకి పెద్దగా బలం పుంజుకోలేదు..పైగా ఇక్కడ వైసీపీకి సరైన నాయకుడు కనబడటం లేదు.

అటు రూరల్ నియోజకవర్గంలో బుచ్చయ్య చౌదరీ బలం తగ్గలేదు….వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బుచ్చయ్య నిలబడి సత్తా చాటేలా ఉన్నారు. ఇక పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప స్ట్రాంగ్ గా ఉన్నారు..ఇక్కడ వైసీపీలో ఆధిపత్య పోరు ఉంది. అయితే మండపేటలో వైసీపీ తరుపున తోట త్రిమూర్తులు పనిచేస్తున్నారు…ఈయన కొంచెం పార్టీని బలోపేతం చేస్తున్నారు గాని….సౌమ్యుడు, ఎప్పుడు ప్రజల్లో ఉండే వేగుళ్ళ జోగేశ్వరరావుకు ప్రజల మద్ధతు ఎక్కువగానే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ నాలుగు సిటింగ్ సీట్లు మళ్ళీ టీడీపీ ఖాతాలోనే పడేలా ఉన్నాయి.
Discussion about this post