ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కొత్త జోష్ పెరిగింది. అది కూడా వైసీపీ ప్రకటన తర్వాత.. ఈ జోష్ మరింత ఊపందుకుంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్.. పార్టీ ఎమ్మెల్యేలు.. ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ లక్ష్యాలను వారితో పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 151 సీట్లలో ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదని.. చెప్పేశారు. అంతేకాదు.. గెలిచే వారికే టికెట్ లు ఇస్తామన్నా రు.ఇక, దీంతో ఊరుకోకుండా.. అసలు 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేమన్నారు.

ఈ పరిణామం.. అనూహ్యంగా వైసీపీలో నీరసం వచ్చేలాచేసింది. అదేసమయంలో టీడీపీలో జోష్ పెంచే సింది. అదేంటి.. ఎలా? అని ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజం. ఎందుకంటే.. భారీ టార్గెట్ ఎప్పుడూ.. రాజ కీయాల్లో అతిగా ఉంటుంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నారు. కడప వంటి వైసీపీకి కంచుకోటల్లోనూ గెలుపు గుర్రం ఎక్కాలని అనుకున్నారు. దీంతో ఫోకస్ అంతా ఆయా జిల్లాలపై పెట్టేసరికి.. గెలుపు గుర్రం ఎక్కే జిల్లాల్లోనూ.. పార్టీ చితికిల పడింది.

ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా 175 నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం.. అదే పరిణామాలను తిరిగి తీసుకువస్తుందని అంటున్నారు. అంతేకాదు.. పార్టీలో గెలిపించే బాధ్యతను జగన్ వదులుకున్నారు. ఈ బాధ్యతలను ఎమ్మెల్యేలపై నాయకులపై పెట్టారు. ఇది ఆధిపత్యానికి దారితీసి.. మొత్తానికే మోసం జరు గుతుందని.. అంతిమంగా తమకు లాభిస్తుందని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఎందుకం టే.. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను నాయకులను ఎదిరించి గెలవడం సాధ్యం కాదు. దీనిని పార్టీ అధి నేతే చక్కదిద్దాలి. కానీ, జగన్ ఆశలు వదులు కోవడం ద్వారా.. ఆయన చేతులు ఎత్తేసినట్టేనని తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. కీలక అంశాలపై ఫోకస్ మానేశారు. అంటే.. రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా అంశాలను… జగన్ పూర్తిగా పక్కన పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కేవలం సంక్షేమంపైనే దృష్టి పెడుతున్నారు. ఈ పరిణామం తమకు లాభిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Discussion about this post