వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పుడున్న పరి స్థితిలో పార్టీ విజయం దక్కించుకునేందుకు నాయకులు మరింతగా కష్టపడాలని.. పార్టీలో చర్చ అయితే.. జరుగుతోంది. ఇదిలాఉంటే, వచ్చే ఎన్నికలకు సంబంధించి టార్గెట్ ఎంత? అనేది కూడా టీడీపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఇద్దరు కీలక నాయకులు చేసిన ప్రకటన పార్టీలో చర్చకు దారితీస్తోం ది. కొన్నాళ్ల కిందట.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. తాము 160 స్థానాల్లో గెలిచి తీరుతామని ప్రకటించారు.

దీంతో అప్పట్లో వైసీపీ నేతలు కూడా.. గెలిచి చూపించాలని సవాల్ రువ్వారు. అంతేకాదు.. ఒంటరిగా పో టీ చేసి గెలవాలని కూడా వ్యాఖ్యానించారు. ఇక, ఇదే విషయంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా.. తమకు 160 సీట్లు ఖాయమని.. వ్యాఖ్యానించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ టార్గె ట్ 160 స్థానాలా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలావుంటే.. టీడీపీ అంతర్గత సమావేశాల్లో మాత్రం.. దీనిపై జోరుగా మంతనాలు జరుపుతున్నారు. 160 సీట్లా.. 120 సీట్లా.. ? అనే విషయంలో తర్జనభర్జన కొనసాగుతోంది.

ఎందుకంటే. పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే.. 160 స్థానాల టార్గెట్‌తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయి తే.. ఇదే జరిగితే.. గత ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో.. ఇప్పుడు కూడా అవే ఇబ్బందు లు తప్పవని నేతలు మథన పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 120 సీట్లకు టార్గెట్ పెట్టుకుని.. 100 సీట్లలో గెలిచే ప్రయత్నాలు చేస్తే.. కనీసం 90 స్థానాలలో అయినా.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయ మని సీనియర్లు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

“అన్ని సీట్టా.. ఇన్ని సీట్లా.. అనేది పక్కన పెడితే.. అధికారంలోకి వచ్చేందుకు 90 స్థానాలు దక్కించుకుం టే చాలు. ఆదిశగా అడుగులు వేయాలని చెబుతున్నాం. ఎందుకంటే.. అలా చేయకపోతే.. మొత్తానికే ముప్పు తప్పదు. ఇప్పటికైనా.. లక్ష్యాలుపెద్దగా పెట్టుకోవడం మంచిదే అయినా.. దానిని సాధించేందుకు ప్రయత్నాలు కూడా అంతే రేంజ్‌లో సాగాలి. అందుకే లక్ష్యాన్ని సాధ్యమైనంత తగ్గించుకుని.. పని ఎక్కువగా చేయడం ద్వారా అనుకున్నది సాధిస్తాం“ అని తూర్పుకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Discussion about this post