వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి గెలవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందుకే చంద్రబాబు ప్రతి ఒక్క నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. బలమైన అభ్యర్ధులని రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని కూడా రెడీ చేశారు. ఒకవేళ ఎవరైనా సరిగా పనిచేయకపోతే వారిని మార్చేసి వేరే వారికి ఛాన్స్ ఇస్తున్నారు.
అయితే అన్నీ బాగానే ఉన్నా కొన్ని స్థానాల్లో బాబు..ఇంకా టిడిపి ఇంచార్జ్‌లని ఖరారు చేయలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కూడా..కొన్ని స్థానాలని అలాగే వదిలేశారు. ఏదైనా వ్యూహం ప్రకారం వదిలేశారా? లేక సారైనా దొరక్క వదిలేశారా? అనేది తెలియదు గాని..చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని..పూతలపట్టు నియోజకవర్గంలో టిడిపికి నాయకుడు లేరు. గత ఎన్నికల తర్వాత నుంచి ఇక్కడ టిడిపికి సరైన నాయకత్వం లేదు. గత కొన్ని ఎన్నికల నుంచి ఇక్కడ ఎల్. లలితకుమారి టిడిపి నుంచి పోటీ చేస్తూ ఓడిపోయారు.

గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆమె టిడిపిని వదిలేసి బయటకొచ్చేశారు. ఆ తర్వాత టిడిపికి ఇంచార్జ్‌ని పెట్టలేదు. అలాగే ఖాళీగా వదిలేశారు. ఇప్పటికీ అక్కడ నేత లేరు. ఎన్నికల సమయం దగ్గరపడిపోతుంది. దీంతో అక్కడ టిడిపి శ్రేణులు..తమకు నాయకుడు కావాలని కోరుతున్నారు.
అయితే అక్కడ చంద్రబాబు ఎవరిని నిలబెడతారో అర్ధం కాకుండా ఉంది. ఎన్నికల ముందు ఎవరినైనా కీలక నేతని దించుతారా? లేక పొత్తులో భాగంగా సీటు వేరే పార్టీకి ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. కానీ ఇలా నాయకుడు లేకపోవడం వల్ల టిడిపికి మైనస్ అవుతుంది. ఎలాగో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే బాబుకు మైనస్ ఉంది. కానీ దాన్ని యూజ్ చేసుకోవడానికి బలమైన టిడిపి నాయకుడు లేరు. చూడాలి మరి ఈ సారి పూతలపట్టుని దక్కించుకుంటారో..లేదా వదిలేస్తారో.