చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో వైసీపీ హవా కొనసాగేలా ఉంది. గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. పేరుకు చంద్రబాబు సొంత జిల్లా గాని..పూర్తిగా ఆ జిల్లాలో వైసీపీదే హవా. 2014 ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 8, టిడిపి 6 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ 13, టిడిపి ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.

అయితే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..మిగతా జిల్లాల్లో రాజకీయం మారుతుంది..కానీ చిత్తూరులో మాత్రం మారడం లేదు. తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో వైసీపీకే లీడ్ వచ్చింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 8, టిడిపి 4 సీట్లు మాత్రమే గెలుచుకుందని, 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని తేల్చి చెప్పింది. అంటే వైసీపీకి ఇక్కడ స్పష్టమైన ఆధిక్యం ఉంది. వైసీపీ గెలిచే సీట్లు వచ్చి..పుంగనూరు, తంబళ్ళపల్లె, తిరుపతి, చంద్రగిరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, చిత్తూరు సీట్లు.టిడిపి గెలిచే సీట్లు వచ్చి..కుప్పం, నగరి, మదనపల్లె, పలమనేరు..ఇక టఫ్ ఫైట్ వచ్చి పీలేరు, శ్రీకాళహస్తి. అంటే జిల్లాలో టిడిపి ఇబ్బందులో ఉంది. ఇలా ఉండటానికి కారణాలు ఉన్నాయి. కొన్ని స్థానాల్లో టిడిపికి సరైన నాయకులు లేరు. పూతలపట్టు, చిత్తూరుల్లో ఇంచార్జ్ లు లేరు. తంబళ్ళపల్లె, తిరుపతి, జీడీ నెల్లూరు ఇంచార్జ్ లు ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదు.

అందుకే జిల్లాలో టిడిపి వెనుకబడింది. అన్నీ జిల్లాల్లో కంటే చిత్తూరులోనే టిడిపికి దారుణమైన ఫలితం కనిపిస్తుంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి..ఈలోపు టిడిపి పట్టు పెంచుకుంటే ఇబ్బంది లేదు..లేదంటే జిల్లాలో టిడిపికి దారుణమైన ఫలితాలు ఖాయం.