ఔను! ఇది నిజమే. వైసీపీకి చెందిన రెడ్డి సామాజిక వర్గం.. ప్రస్తుతం జగన్‌పై ఆశలు వదులుకుంటున్న పరి స్థితి కనిపిస్తోంది. ఆయన తమకు ఏదో చేస్తారని.. భావించామని.. కానీ, ఏమీ జరగడం లేదని రెడ్డి వర్గానికి తీవ్ర ఆవేదనగా ఉంది. దీనికితోడు రెడ్డి వర్గానికి చెందిన నాయకులకు జగన్ కనీసం.. అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా ఉఉన్న మీడియా ఎలాంటి ప్రచారం చేస్తుందోనని జగన్ భావిస్తున్నట్టుగా ఉన్నారని పార్టీలోనూ చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో రెడ్డి వర్గం.. ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరుకు చెందిన సీనియర్ నాయ కుడు.. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి.. ఇటీవల కాలంలో రెడ్డి సామాజిక వర్గాన్ని సంఘటితం చేసే పనిప్రా రంభించారని.. వార్తలు వచ్చాయి. గత ఎన్నికలకు ముందు… ఆయన ఇదేవిధంగా రెడ్డి వర్గాన్ని సంఘటిత పరిచి.. రాష్ట్రంలో నాయకత్వాన్ని మారిస్తే.. తప్ప.. తమకు ప్రయోజనాలు దక్కవని ఆయన వ్యాఖ్యానిం చారు. ఈ క్రమంలోనేజగన్‌వైపు రెడ్డి సామాజిక వర్గం అడుగులు వేసింది.

అయితే.. ఇంత చేసిన తనకు జగన్ అస్సలు ప్రాధాన్యమే ఇవ్వడం లేదన్నది.. మోదుగుల మాట. కొన్నా ళ్లుగా ఆయన పదవి కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలోకివచ్చిన మోదుగుల.. గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం దక్కించుకోలేక పోయారు. తర్వాత.. ఎమ్మెల్సీ కోసం.. ప్రయత్నా లు చేశారు. అయితే.. దీనిని ఇప్పటి వరకు సాధించలేదు.ఇక, వచ్చే ఎన్నికల్లోనూ.. ఆయనకు టికెట్ లభించే అవకాశం కనిపించడం లేదు. ఇదిలావుంటే..జగన్ అప్పాయింట్‌మెంట్ కోసం.. గత రెండు వారాలుగా ఆయన ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదని.. తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇక, వైసీపీకి రాం…రాం..చెప్పడమే మంచిదనే భావన మోదుగులలో కనిపిస్తోంది. రెడ్డి వర్గాన్ని సంఘటిత పరిచి.. చంద్రబాబుకు జై కొట్టించడం ద్వారా… ఆయన పదవిని పొందాలని ఆశిస్తు న్నట్టు గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటు చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో రెడ్డి వర్గాన్ని తనవైపు తిప్పుకోనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అటు మోదుగుల, ఇటు బాబులకు ఒకే లక్ష్యం ఉండడంతో.. ఆయన చేరిక తప్పదనే వాదన వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post