March 24, 2023
టీడీపీతో కమ్యూనిస్టులు..కంటిన్యూ చేస్తారా?
ap news latest AP Politics

టీడీపీతో కమ్యూనిస్టులు..కంటిన్యూ చేస్తారా?

ఏపీలో రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది..అధికార బలంతో ఉన్న వైసీపీకి చెక్ పెట్టేందుకు టి‌డి‌పి కొత్త ప్లాన్ తో వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ..బోగస్ ఓట్లు సృష్టించి గెలవాలని చూస్తున్న వైసీపీని ఓడించడానికి టి‌డి‌పి-కమ్యూనిస్టులు ఏకమవుతున్నారు. కాకపోతే ఆల్రెడీ రెండు పార్టీలో బరిలో ఉండి కూడా కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాయి. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

అన్నీ స్థానాల్లో వైసీపీ..కమ్యూనిస్టుల ఉభయ సంఘం పి‌డి‌ఎఫ్ పోటీ చేస్తున్నాయి. ఇటు టి‌డి‌పి మాత్రం పట్టభద్రుల స్థానాల్లోనే పోటీ చేస్తుంది. అయితే బరిలో ఉన్నా సరే పట్టభద్రుల స్థానాల్లో పరస్పరం సహకరించుకోవాలని టి‌డి‌పి-కమ్యూనిస్టులు డిసైడ్ అయ్యారు. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నచ్చిన అభ్యర్ధికి ఒకటో నంబర్ ప్రాధాన్యత ఇచ్చుకుంటారు..ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు అంటూ ప్రాధాన్యత ఇస్తూ ఓటు వేస్తారు. అయితే ఒకటో నంబర్ ఓట్లు కావల్సిన అన్నీ రాకపోతే…రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కపెడతారు. అప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు డిక్లేర్ ఛేస్తారు.

అందుకే టి‌డి‌పి-కమ్యూనిస్టులు కలిసి పరస్పరం సహకరించుకుంటూ..కమ్యూనిస్టులని అభిమానించే వారు..ఒకటో నంబర్ ప్రాధాన్యత తమ అభ్యర్ధులకు ఇచ్చుకుంటారు. ఇక రెండో నంబర్ ప్రాధాన్యత టి‌డి‌పికి ఇస్తారు. అదే రివర్స్ లో టి‌డి‌పి వాళ్ళు చేస్తారు. ఒకటి టి‌డి‌పికి, రెండు పి‌డి‌ఎఫ్ కి ఓటు వేస్తారు. అయితే ఉపాధ్యాయ ఎన్నికల్లో తమకు మద్ధతు ఇవ్వాలని ఇటు పి‌డి‌ఎఫ్..అటు ఏపీటీఎఫ్ కోరుతున్నాయి. మరి టి‌డిపి ఎవరికి మద్ధతు ఇస్తుందో చూడాలి ఏదేమైనా వైసీపీని ఓడించడానికి టి‌డి‌పి-కమ్యూనిస్టులు కలుస్తున్నారు.  అయితే ఈ పొత్తు ఇలాగే కొనసాగుతుందో లేదో చూడాలి.