రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…ఇప్పటివరకు మెజారిటీ స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా నడిచిన రాజకీయం…ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా మారే పరిస్తితి కనిపిస్తోంది…ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్ సీట్లలో టీడీపీ బలం పుంజుకుంది. అయితే కొన్ని టీడీపీ సిట్టింగ్ సీట్లలో కూడా రాజకీయం మారుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే..అందులో నలుగురు వైసీపీ వైపుకు వెళ్లారు.

దీంతో టీడీపీ బలం 19కు చేరుకుంది..ఇక ఈ 19 సీట్లని టీడీపీ మళ్ళీ గెలుచుకుంటుందా? అంటే ఇందులో మూడు సీట్లు డౌటే అని విశ్లేషణలు వస్తున్నాయి. అలా అని ఆ సీట్లలో టీడీపీ బలం తక్కువేమీ కాదు…కానీ టీడీపీ ఎమ్మెల్యేలు సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల పార్టీకి మైనస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కుప్పం, హిందూపురం, ఉరవకొండ, పర్చూరు, అద్దంకి, కొండపి, విజయవాడ ఈస్ట్, పాలకొల్లు, ఉండి, రాజమండ్రి రూరల్, సిటీ, మండపేట, పెద్దాపురం, విశాఖ ఈస్ట్, వెస్ట్, టెక్కలి సీట్లలో టీడీపీ బలం ఏ మాత్రం తగ్గడం లేదు…అలాగే వైసీపీ ఎత్తులు వేసి స్థానిక ఎన్నికలు గెలిచిన సరే…ఓవరాల్ గా చూస్తే మాత్రం టీడీపీనే స్ట్రాంగ్ గా ఉంది.

అయితే రేపల్లె, విశాఖ నార్త్, ఇచ్చాపురం సీట్లలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ దూకుడుగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు…పైగా ఈ మూడు స్థానాల్లో వైసీపీ నేతలు ఎక్కువ యాక్టివ్ గా ఉన్నారు..రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎక్కువ హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు…దీంతో రేపల్లెలో టీడీపీకి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అటు విశాఖ నార్త్ లో గంటా శ్రీనివాసరావు గురించి చెప్పాల్సిన పని లేదు…ఆయన నియోజకవర్గానికే కాదు…పార్టీకే అందుబాటులో ఉండటం లేదు.


అటు ఇచ్చాపురంలో ఎమ్మెల్యే అశోక్ పరిస్తితి కూడా అలాగే ఉంది..అయితే ఇప్పటినుంచి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పనిచేసుకుంటూ వెళితే ఎన్నికల సమయానికి మళ్ళీ పుంజుకునే ఛాన్స్ ఉంది…లేదంటే సిట్టింగ్ సీట్లని టీడీపీ కోల్పోవాల్సి వస్తుంది.

Discussion about this post