ఏపీలో రివర్స్ రాజకీయాలు మొదలైనట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్ళు కూడా కాలేదు. కానీ అప్పుడే రివర్స్ జంపింగ్‌లు మొదలయ్యాయి. సాధారణంగా ఏ నాయకుడైన అధికార పార్టీలో చేరాలని అనుకుంటారు….అలాగే అధికార పార్టీని ప్రతిపక్షంలో చేరడానికి ఇష్టపడరు. కానీ ఏపీలో ఇప్పుడుప్పుడే కాస్త రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీలో ఉన్న కింది స్థాయి నాయకులు టిడిపిలో చేరుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోనే వైసీపీ కార్యకర్తలు టిడిపిలోకి వచ్చారు. అలాగే పలువురు నేతలు కూడా టిడిపిలోకి వచ్చారు. అయితే తాజాగా కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టిడిపిలో చేరనున్నారు.

తన కుమారుడు భూపేష్ రెడ్డితో కలసి పార్టీలో చేరుతున్నారు. ఇక భూపేష్‌కు జమ్మలమడుగు టిడిపి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించనున్నారు. నారాయణరెడ్డి….బిజేపి నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు. ఆదినారాయణకు జమ్మలమడుగు స్థానంపై ఎంత పట్టు ఉందో తెలిసిందే. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆది..ఆ తర్వాత టిడిపిలోకి వచ్చి మంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

అయితే రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాకపోవడంతో బిజేపిలోకి జంప్ చేశారు. అటు జమ్మలమడుగులో టిడిపిలో కీలకంగా ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే జమ్మలమడుగు బాధ్యతలు నారాయణరెడ్డి కుమారుడుకు దక్కనున్నాయి. ఇక వీరితో పాటు టీవీ డిబేట్లలో తనదైన శైలిలో ప్రభుత్వం తప్పులని ఎత్తిచూపుతూ….మంచి వక్తగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ నేత జి వెంకటరెడ్డి సైతం టిడిపి తీర్ధం పుచ్చుకొనున్నారు.

కాంగ్రెస్‌లో ఉన్నా సరే ఈయన…వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంకా దారుణంగానే ఉంది. ఈ క్రమంలోనే వెంకటరెడ్డి….టిడిపిలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే ఇలాంటి నాయకులు చేరడం వల్ల టిడిపికి బెనిఫిట్ అనే చెప్పొచ్చు.

Discussion about this post