ఔను! గత ఎన్నికలకు ముందు ఎలాంటి సమస్యను టీడీపీ ఎదుర్కొన్నదో.. ఇప్పుడు అదే తరహా సమస్య ను టీడీపీ ఎదుర్కొంటున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికలను చూసుకుంటే.. కేవ లం అందరు నాయకులు కూడా చంద్రబాబుపైనే ఆధారపడిపోయారు. “ఆయనే రావాలి.. మమల్ని గెలిపించాలి!“ అన్న విధంగా నాయకులు వ్యవహరించారు. దీంతో పనిగట్టుకుని చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లోనూ.. కాలికి బలపం కట్టుకుని తిరిగారు.
ప్రజలకు వంగి వంగి దణ్ణాలు కూడా పెట్టారు. తన మొహం చూసి.. టీడీపీ నేతలను గెలిపించాలని.. పిలు పునిచ్చారు. అయితే.. ఇది వర్కవుట్ కాలేదు. పార్టీ నేతలు ఘోరంగా ఓడిపోయారు. అయితే.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఏడాదిన్నరలో ఎన్నికల రంగానికి కార్యాచరణ కూడా ప్రారంభం కా నుంది. అయితే.. ఇప్పటి వరకు కూడా నాయకులు మనస్పూర్తిగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. తమ కంటూ.. ఇన్షియేట్ తీసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపించడం లేదు.
చంద్రబాబు పార్టీ పరంగా ఏదైనా పిలుపునిస్తే.. దానిని నిర్వహించడం వరకే పరిమితం అవుతున్నారు.. తప్ప.. తమకంటూ.. ప్రాతిపదిక వేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి.. ఓటు బ్యాంకును స్థిరీకరిస్తు న్న వాతావరణం వంటివి ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి వ్యక్తిగతంగా నాయకులు ప్రజలను కలిసి.. వారినివారు ప్రమోషన్ చేసుకునే పరిస్థితి ఇప్పటికే తెరమీదికి వచ్చి ఉండాలి. కానీ, ఆవిధంగా ఎక్కడా కూడా జరగలేదు.
ఈ పరిణామాలను గమనిస్తే.. నాయకులు మూకుమ్మడిగా మరోసారి.. చంద్రబాబుపైనే ఆధారపడిపోయా రనే వాదన వినిపిస్తుండడం పపార్టీలో చర్చకు దారితీస్తోంది.“ మా నేతల పరిస్థితి చూస్తే.. మళ్లీ చంద్రబా బు రావాలి. వచ్చి.. తమను గెలిపించాలని.. కోరుకుంటున్నారు. బహుశ అందుకే.. వారు బయటకు రావ డం లేదని.. భావిస్తున్నాం. ఎంత మందికని చెబుతాం“ అని ఒక సీనియర్ వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకుని మరోసారి వంగివంగి దణ్నాలుపెట్టే పరిస్థితి వస్తోందని అంటున్నారు నాయకులు.
Discussion about this post