వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ..వ్యూహకర్తలపై ఎక్కువ ఫోకస్ చేసింది. గత ఎన్నికల ముందు జగన్..పూర్తిగా ప్రశాంత్ కిషోర్‌ని నమ్ముకుని ముందుకెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ టీం అయిన..ఐప్యాక్ టీమ్ని నమ్ముకుని పనిచేస్తున్నారు. వైసీపీ గెలుపు కోసం ఐప్యాక్ టీం పనిచేస్తుంది. అయితే వైసీపీకి ధీటుగా ఉండటానికి చంద్రబాబు సైతం రాబిన్ శర్మని వ్యూహకర్తగా నియమించుకున్న విషయం తెలిసిందే.


మొన్నటివరకు రాబిన్ తెరవెనుకే ఉన్నారు గాని…ఈ మధ్య ఇదేం ఖర్మ కార్యక్రమం రూపకల్పనతో రాబిన్ తెర ముందుకొచ్చారు. ఇదేం ఖర్మ సక్సెస్‌గా రన్ అవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక రాబిన్ శర్మ ఉండగానే ఆయనకు తోడుగా శంతన్ సింగ్ అనే వ్యూహకర్తని టీడీపీ నియమించుకుంది. శంతన్ సైతం రాబిన్ టీంలో పనిచేయనున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాబిన్, శంతన్ సైతం ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన వారే.

మరొక ట్విస్ట్ ఏంటంటే..శంతన్ వైసీపీ కోసం పనిచేస్తున్న ఐప్యాక్ టీమ్‌లో పనిచేసిన వ్యక్తి. మొన్నటివరకు ఆయన ఐప్యాక్ టీంలో పనిచేశారు. ఇప్పుడు ఐప్యాక్ టీంకు గుడ్ బై చెప్పి టీడీపీ వైపుకు వచ్చారు. అయితే వైసీపీలో వ్యూహాలు, వారి రాజకీయం అన్నీ అంశాలు శంతన్‌కు అవగాహన ఉండే ఉంటుంది. దీని వల్ల ఇప్పుడు టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఇప్పటికే రాబిన్ శర్మ వ్యూహాలు టీడీపీకి బాగానే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు శంతన్ చేరడం టీడీపీకి అడ్వాంటేజ్‌గా మారే ఛాన్స్ ఉంది. మరి ఈ వ్యూహకర్తలతో టీడీపీ గెలుపు అవకాశాలు ఎంత మాత్రం పెరుగుతాయో చూడాలి.

Leave feedback about this