గత ఎన్నికల్లో టీడీపీ శ్రేణులే కాదు…రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించని ఓటముల్లో పరిటాల, జేసీ ఫ్యామిలీల ఓటములు కూడా ఉన్నాయి. అసలు రాప్తాడులో పరిటాల శ్రీరామ్, తాడిపత్రిలో జేసీ అస్మిత్‌లు ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. కానీ జగన్ గాలిలో వారు ఓడిపోయారు. అయితే ఈ ఓటముల నుంచి రెండు ఫ్యామిలీలు కూడా త్వరగానే బయటపడుతున్నాయని చెప్పొచ్చు. తాడిపత్రిలో టీడీపీ అనూహ్యంగా పుంజుకున్న విషయం తెలిసిందే.


నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ టీడీపీని ఓడించడం కష్టమనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక క్లారిటీ రావాలి. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ బరిలో దిగుతుందని తెలుసు…కానీ ఎవరు బరిలో దిగుతారో క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ తనయుడు అస్మిత్ పోటీ చేసి ఓడిపోయారు. మరి నెక్స్ట్ కూడా అస్మిత్ పోటీ చేస్తారో లేదో క్లారిటీ లేదు. కానీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ పోటీ చేస్తే బెటర్ అని టీడీపీ అధిష్టానం సూచిస్తుందట. మరి దీనికి జేసీ ఫ్యామిలీ ఓకే చెబుతుందో లేదో చూడాలి.


అటు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ పోటీ చేయడం ఖాయం. కానీ ఎవరు పోటీ చేస్తారో తెలియదు. గత ఎన్నికల్లో సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని తనయుడు శ్రీరామ్‌ని పోటీకి దించారు. కానీ శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు పరిటాల ఫ్యామిలీ చేతిలో రెండు సీట్లు ఉన్నాయి. రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. దీంతో రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్‌లు బరిలో దిగాలని చూస్తున్నారు.

కాకపోతే చంద్రబాబు ఆ ఛాన్స్ ఇస్తారా లేదా? అనేది చూడాలి. ఎందుకంటే ధర్మవరం సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది…ఇది బీజేపీ నుంచి వచ్చే గోనుగుంట్ల సూర్యనారాయణకు ఇవ్వొచ్చని ప్రచారం ఉంది. కానీ ఈ సీటు తనదే అని శ్రీరామ్ అంటున్నారు. రెండు సీట్లు ఇస్తే ఇబ్బంది లేదు…ఒకవేళ ఒక సీటు ఇస్తే..రాప్తాడులో శ్రీరామ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

Discussion about this post