ఇప్పుడు ఎక్క డ చూసినా.. టీడీపీ యూత్ కనిపిస్తున్నారు. అటు పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్న కార్యక్రమాలు కావొచ్చు.. ఇటు పార్టీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ పార్టిసిపేట్ చేస్తు న్నకార్యక్రమాలు కావొచ్చు. ఏదైనా కూడా యువత బాగా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా.. గజ మాలలతో సత్కరిస్తున్నారు. ఘన మైన స్వాగతాలు పలుకుతున్నారు. తాజాగా రాయల సీమ జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబుకు, శ్రీకాకుళం జిల్లారాజాంలో పర్యటించినలోకేష్‌కు కూడా యూత్ ఫాలోయింగ్ అదిరిపోయింది.


నిజానికి గత రెండేళ్లుగా.. యువత పార్టీకి దూరంగా ఉన్నారనేది వాస్తవం. ఎక్కడైనా సీనియర్లు ముందుకు రావడం.. వారే పార్టీ తరఫున వాయిస్ వినిపించడం.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం.. సీఎం జగన్ పై విమర్శలు చేయడం.. వంటివి చేస్తున్నారు. అయితే.. దీనివల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని గ్ర హించిన పార్టీ అధినేత చంద్రబాబు యువ జపాన్ని అందుకున్నారు. యువతకు వచ్చే ఎన్నికల్లో 40 శాతంటికెట్ ఇస్తున్నామని చెప్పారు.

దీంతో ఒక్కసారిగా యూత్‌లో క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను గమనిస్తే.. అప్పటి వరకుపార్టీని భుజాన వేసుకుని నడిపించిన యువతకు ప్రాధాన్యం లేకుండా చేసి.. కొత్తగా వచ్చి న వారికి .. లేదా సీనియర్లకు టికెట్‌లు ఇస్తూ.. వచ్చారు. దీంతో యువత నిరాశకు గురయ్యారు. అయితే.. ఈ దఫా.. యువతకే ప్రాధాన్యం ఇస్తామని.. చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఇప్పుడు తమ ఆశలు నెర వేరడం ఖాయమని భావించిన యువత.. పుంజుకున్నారు.

చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో 40 సీట్లు యువతకు కేటాయిస్తే.. దాదాపు 70 నియోజకవ ర్గాలు వారికి దక్కుతాయి. వీటిలో 20 చోట్ల వారసులకు పోయినా.. మిగిలిన 20 స్థానాలు ఔత్సాహిక యువ తకు దక్కే అవకాశం ఉందని లెక్కలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే.. పార్టీ జెండా పట్టుకున్న వారు ఇప్పుడు తమ ఆశలు ఫలిస్తాయని ఆశిస్తున్నారు. దీంతో యువతలో క్రేజ్ పెరిగిందనే చెప్పాలి.

Discussion about this post