ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఉన్న కొన్ని కంచు కంఠాలు ఇటీవల కాలంలో మూగబోతున్నాయని పెద్ద ఎత్తున వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. టీడీపీకి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా.. ఈ నాయకులు దూకుడుగా వ్యవహరిస్తారు. ఏ విషయాన్నయినా.. పార్టీకి, అధినేత చంద్రబాబుకు అనుకూలంగా.. మాట్లాడి.. సమస్య ను తగ్గించడంలో ప్రాధాన్యం ఇస్తారు. అదేసమయంలో పార్టీ పుంజుకునేలా వ్యవహరిస్తుంటారు కూడా. అయితే.. ఇటీవల కాలంలో గత ఆరు మాసాలుగా.. ఈ గళాలు మూగబోయాయి.

దీంతో ఏం జరిగింది? అనే చర్చ అంతర్గతంగా,బహిర్గతంగా కూడా జరుగుతుండడం గమనార్హం. ఇంతకీ ఆ గళాలే..కమ్మసామాజిక వర్గానికి చెందిన నాయకులు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఎ ప్పుడూ… మీడియాలో కనిపించేవారు. అదేసమయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇలా.. ప్రతి ఒక్కరూ.. పార్టీకి.. అనుకూలంగా మాట్లాడేవారు. అయితే.. వీరు ఇప్పుడు కనుమరుగయ్యారు. నిత్యం ప్రెస్‌మీట్లు పెట్టే.. దేవినేని ఎక్కడున్నారో తెలియదు.




ఇక, కనీసం వారానికి రెండు సార్లయినా.. మీడియా ముందుకు వచ్చే ప్రత్తిపాటి పుల్లారావు కూడా ముఖం చాటేశారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. అయితే.. దీనిపై వినిపిస్తున్న మాట ఏంటంటే… ప్రస్తుతం ఈ గళాలకు కొంత విరామం ఇవ్వాలని… చంద్రబాబు నిర్ణయించుకున్నారని అంటున్నారు. అంతేకాదు.. అదే సమయంలో దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని కూడా నిర్ణయించారట.

దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు, మాజీ మంత్రులు, తెలుగు మహిళలు ఎక్కువగా.. తెరమీదికి వస్తున్నారు. విషయం ఏదైనా.. మాజీ మంత్రి కేఎస్ జవహర్, వంగలపూడి అనిత, వర్ల రామ య్య, కేఎస్ రాజు, పిల్లి మాణిక్యాలరావు.. ఇలా.. చాలా మంది ఎస్సీ నాయకులు.. నిత్యం మీడియాతోనే ఉంటున్నారు. దీనికి కారణం ఏంటనేది దానిపై.. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఓట్లకు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో ఇలా చేస్తున్నారని.. కేవలం కమ్మ వర్గమే మీడియా ముందుకు వస్తే.. బ్యాడ్ సింప్టమ్స్ వెళ్తున్నాయని.. అందుకే ఇలా చేశారని.. అంటున్నారు. మరి ఈ ఫార్ములా ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.





Discussion about this post