నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఈ సారి టీడీపీ తరుపున ఎవరు బరిలో దిగుతారు? అంటే అసలు ఏ మాత్రం క్లారిటీ లేదనే చెప్పాలి. అసలు ఇక్కడ టీడీపీ తరుపున బరిలో దిగే అభ్యర్ధి ఎవరు అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అసలు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా టీడీపీ తరుపున రఘురామకృష్ణంరాజు పోటీ చేయాలి…కానీ ఆయన చివరి నిమిషంలో వైసీపీలోకి వెళ్ళి గెలిచారు. అయితే రఘురామ అటు వైపు వెళ్ళడంతో…చంద్రబాబు వెంటనే ఉండిలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వేటుకూరి శివరామరాజుని నరసాపురం ఎంపీగా బరిలో దింపారు.

అటు ఉండిలో వేటుకూరి సన్నిహితుడు మంతెన రామరాజుని బరిలో దింపారు. అయితే రామరాజు విజయం సాధించారు గానీ, శివరామరాజు..నర్సాపురం బరిలో తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయాక శివరామరాజు టీడీపీలో యాక్టివ్ గా కనిపించడం లేదు. ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన అడ్రెస్ లేరు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈయన మళ్ళీ ఉండి నియోజకవర్గానికి వచ్చేస్తారని ప్రచారం నడుస్తోంది. అంటే మళ్ళీ శివరామరాజు ఉండిలో పోటీ చేస్తారని తెలుస్తోంది.

శివరామరాజు ఉండి వస్తే రామరాజు పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు. పైగా నరసాపురం పార్లమెంట్‌లో టీడీపీ తరుపున ఎవరు బరిలో దిగుతారో క్లారిటీ లేదు. అయితే వైసీపీ నుంచి గెలిచిన రఘురామ ఎలాగో ఆ పార్టీకి వ్యతిరేకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగడం అసాధ్యం…కాస్త రాజకీయ కోణంలో ఆలోచిస్తే రఘురామ టీడీపీలోకి వచ్చి మళ్ళీ బరిలో దిగే ఛాన్స్ కూడా లేకపోలేదు.

ఒకవేళ జనసేనతో పొత్తు ఉండి…నరసాపురం సీటు సైతం ఆ పార్టీకే దక్కేది…రాజుగారు జనసేన నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీడీపీ సపోర్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి. ఇటు ఉండిలో శివరామరాజు బరిలో దిగే ఛాన్స్ ఉంటుంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో రాజకీయం ఎలా ఉంటుందో?

Discussion about this post