ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉన్నా సరే..ఇప్పటినుంచే చంద్రబాబు, సీట్లు ఫిక్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు ఉండాలని బాబు అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడే అభ్యర్ధులని పెట్టుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇలా అసెంబ్లీ స్థానాల్లో మార్పులు అనంతరం..పార్లమెంట్ స్థానాల్లో కూడా మార్పులు చేస్తారని తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్తితుల్లో చాలా పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి నాయకులు లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కొందరు నేతలు పార్టీ మారిపోగా, మరికొందరు సైలెంట్ అయిపోయారు. దీంతో చాలా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ స్థానాలని భర్తీ చేయాలని బాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఎంపీ స్థానాల్లో కమ్మ నేతలని పెడతారని తెలిసింది. కమ్మ నేతలకు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.

ప్రస్తుతానికి ఎలాగో గుంటూరులో గల్లా జయదేవ్, విజయవాడలో కేశినేని నాని ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కమ్మ నేతలే. అలాగే నరసారావుపేట, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం స్థానాలని సైతం కమ్మ నేతలకే కేటాయించనున్నారని తెలుస్తోంది. విశాఖలో ఎలాగో బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ఉన్న విషయం తెలిసిందే. నెక్స్ట్ విశాఖ బరిలో ఆయనే దిగుతారు. అలాగే నరసారావుపేట పార్లమెంట్ సీటుని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీకి ఫిక్స్ చేశారు. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరోకరు నరసారావుపేట బరిలో ఉంటారు.




ఇక ఏలూరులో మాగంటి బాబు సైలెంట్ అయిన విషయం తెలిసిందే. ఆయన వ్యక్తిగత సమస్యల వల్ల రాజకీయాల నుంచి సైడ్ అవుతున్నారు. ఈ సీటులో బోళ్ళ బుల్లిరామయ్య మనవడు బోళ్ళ రాజీవ్ బరిలో దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే రాజమండ్రి సీటులో మురళీమోహన్ కోడలు రూప సైడ్ అయిపోయారు. ఆమె మళ్ళీ పోటీకి దిగరని తెలుస్తోంది. ఆమె ప్లేస్‌లో కమ్మ నేత పోటీ చేస్తారని తెలుస్తోంది.

Discussion about this post