టీడీపీ దూకుడు పెరిగిందా? పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించనుందా? ఆయన కూడా లోలోన సంతోష పడుతున్నారా? అంటే..ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. గత ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని.. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా.. చంద్రబాబు ఇమేజ్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని.. నాయకులు లెక్కలు వేసుకున్నారు. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పుకొచ్చారు. నన్ను చూసి ఓటేయండి!

అని ఎన్నికల సమయంలో వొంగి వొంగి దణ్ణాలు పెట్టారు. అయినప్పటికీ.. గత ఎన్నికలలో టీడీపీ పరాజయంపాలైంది. అయితే.. అప్పటి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా పార్టీ అడుగులు ముందుకు పడలేదు. అయితే.. ఇటీవల కాలంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో చంద్రబాబు పుంజుకున్నారు. ముఖ్యంగా పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగినప్పుడు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనను ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దీక్ష చేశారు.

ఇది పార్టీలో మంచి ఊపు తెచ్చింది. అదేవిధంగా ఇటీవల పార్టీ కార్యకర్త చంద్రయ్య మరణించిన సమయంలో ఆయన పాడె మోసి.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాననే సంకేతాలు పంపారు. ఇవన్నీ కూడా చంద్రబాబుకు ప్లస్‌లుగా మారుతున్నాయని పార్టీ నేతల మధ్య చర్చసాగుతోంది. ఇవన్నీ ఇలా.. ఉంటే.. పార్టీ నేతలతోనూ చంద్రబాబు ఇంటరాక్ట్ కావడం.. నాయకులకు సూచనలు సలహా లు ఇవ్వడంతో పాటు.. వారికి పదవులు కూడా ఇస్తానని చెప్పారు. ఇది కూడా పార్టీలో ఉత్సాహాన్ని నింపింది.

దీనికితోడు.. చంద్రబాబుఎంత కష్టమైనా.. నష్టమైనా.. కార్యకర్తలకు అండగా ఉంటున్నారనే సంకేతాలు అన్ని స్థాయిలోనూ కనిపిస్తుండడం.. క్షేత్రస్థాయిలో పెద్ద నేతల దూకుడుకు అడ్డుకట్ట వేస్తానని చెప్పడం.. అన్నీ తానే చూస్తానని హామీ ఇవ్వడం.. వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీలో జోష్ పెరిగిందని.. గ్రాఫ్ కూడా పుంజుకుందని అంటున్నారుటీడీపీ సీనియర్లు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post