ఏపీలో టీడీపీ ఇప్పుడుప్పుడే పికప్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని జిల్లాలో పార్టీ బలపడుతుంది. కానీ ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయినా సరే నెల్లూరు జిల్లాలో టీడీపీ బలపడేలా కనిపించడం లేదు. అసలు మొదట నుంచే నెల్లూరు జిల్లా టీడీపీకి కలిసిరాదు. అంతకముందు జిల్లాలో కాంగ్రెస్ హవా ఉండేది. గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ హవా నడుస్తోంది.

అసలు టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ దొరకడం లేదు. ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్తితి దారుణంగానే ఉంది. కనీసం వైసీపీకి పోటీ ఇచ్చే స్థాయిలో టీడీపీ నేతలు లేరు. ఆ విషయం తాజాగా జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలో క్లియర్‌గా కనిపించింది. మిగిలిన మున్సిపాలిటీల్లో టీడీపీ నేతలు…వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. కానీ నెల్లూరులో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు.

కార్పొరేషన్‌లో 54 డివిజన్లు ఉంటే టీడీపీ ఒక్క డివిజన్ కూడా గెలవడం దారుణమనే చెప్పాలి. వైసీపీ 54 డివిజన్లు గెలిచేసి క్లీన్‌స్వీప్ చేసింది. అసలు ఇక్కడ టీడీపీ పూర్తిగా విఫలమైంది. ఇదే నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలో టీడీపీ చేతులెత్తేసింది. ఆ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే వైసీపీ 18 గెలుచుకుంటే, టీడీపీ కేవలం 2 వార్డులే గెలుచుకుంది.

మిగిలిన మున్సిపాలిటీల్లో టీడీపీ నేతలు కాస్త వైసీపీకి పోటీ ఇవ్వడానికి ట్రై చేశారు. అసలు నెల్లూరు కార్పొరేషన్‌లో నామినేషన్ల సమయంలోనే తమ్ముళ్ళు చేతులెత్తేశారు. సరే అవి పోతే పోయాయి…మిగిలిన డివిజన్లలోనైనా పోటీ ఇవ్వాలిగా, పైగా నెల్లూరు సిటీలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతుంది.

అలాంటప్పుడు ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని టీడీపీ సత్తా చాటలేకపోయింది…పోనీ కార్పొరేషన్ గెలవకపోయినా కనీసం 10 డివిజన్లు అయినా గెలుచుకోవాలిగా…అది జరగలేదు. ఏదేమైనా నెల్లూరు తమ్ముళ్ళు వీక్‌గానే ఉన్నారు. చంద్రబాబు నెల్లూరుపై దృష్టి పెట్టి, ఇక్కడ నాయకత్వాలని మార్చాల్సిన అవసరం ఉందనే చెప్పాలి.

Discussion about this post