గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ముగ్గురు ఎంపీలు గెలిచిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్‌లు గెలిచారు. అయితే ప్రస్తుతం టీడీపీలో ఇద్దరు ఎంపీలు మాత్రమే యాక్టివ్ గా పనిచేస్తున్నారు. రామ్మోహన్, కేశినేనిలు మాత్రమే పార్టీలో దూకుడుగా ఉన్నారు. మధ్యలో కేశినేని విషయంలో కొన్ని అనుమానాలు వచ్చాయి గానీ, ఆయన మళ్ళీ చంద్రబాబుతో కలిసి సమస్యలని పరిష్కరించుకుని, దూకుడుగా ఉండటం మొదలుపెట్టారు.

కానీ గల్లా జయదేవ్ చాలా రోజుల నుంచి పార్టీలో కనిపించడం లేదు..రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. అసలు ఎక్కడ ఉన్నారు…ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియడం లేదు. రాష్ట్రంలో పలు పరిణామాలు జరుగుతున్నా సరే స్పందించడం లేదు. అసలు ఇంతకు గల్లా ఏమయ్యారని? టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. మొదట్లో పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు….లోక్‌సభలో రాష్ట్ర సమస్యలపై బాగానే గళం విప్పారు.

అలాగే అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉండేవారు..పోలీసుల చేతులో దెబ్బలు కూడా తిన్నారు….అలాగే వైసీపీ ప్రభుత్వం…తమ అమరరాజా సంస్థపై కాలుష్యానికి సంబంధించిన ఆరోపణలపై గట్టిగానే స్పందిస్తూనే వచ్చారు. కానీ ఆ తర్వాత నుంచి గల్లా ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై దాడి జరిగిన స్పందన లేదు….తాజాగా చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడటం…చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం జరిగాయి.

దీనిపై అందరూ స్పందిస్తున్నారు…కానీ గల్లా మాత్రం నో రెస్పాన్స్….సరే రాష్ట్రంలో లేరు అనుకుంటే సోషల్ మీడియా ద్వారా స్పందించవచ్చు…కానీ అలా చేయడం లేదు. సోషల్ మీడియాలో తన తనయుడు హీరోగా నటిస్తున్న ‘హీరో’ చిత్రానికి సంబంధించిన అంశాలని పోస్టు చేస్తున్నారు తప్ప, రాజకీయ పరమైన అంశాలు పోస్టు చేయడం లేదు. అసలు దీనికి కారణం ఏంటి? ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారా? లేక టీడీపీకి దూరంగా ఉన్నారా? అనేది క్లారిటీ లేకుండా పోయింది.

Discussion about this post