ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కొన్నాళ్లుగా ఒక మాట ఉంది. ఎవరైనా ఏదైనా చేస్తే.. మేం సీనియర్లం.. మా కు ప్రాధాన్యం ఉంటుంది.. మాకే చంద్రబాబు వాల్యూఇస్తారు.. మాటే నెగ్గుతుందని… చెప్పేవారు. అంతేకా దు.. ఇదే సమయంలో చంద్రబాబుపైనా ఈ నేతలు విమర్శలు చేసేవారు. కొత్తవారికి మంత్రి పదవులు ఇచ్చారు. కొత్తవారివల్ల పార్టీ నిలబడుతుందా? వారుపార్టీకి వెన్నెముకగా మారతారా? అని కామెంట్లు చేసేవారు. నిజమే కావొచ్చు. కానీ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా అధికార పార్టీ దూకుడు పెరిగినప్పుడు.. ఈ జూనియర్ నేతలే పార్టీకి అండగా ఉంటున్నారు

.
ఇలాంటి వారిలో మాజీ మంత్రి కేఎస్ జవహర్.. పార్టీ అధినేత కనుసన్నల్లో తన పని తాను చేసుకుని పోతున్నారు. ముఖ్యంగా పార్టీని ఇప్పుడున్న కష్టకాలంలో బలోపేతం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి అయినప్పటికీ.. ఆయన ఎక్కడా కూడా బేషజాలకు పోకుండా… పార్టీ తరఫున అందరినీ కలుపుకొని పోతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంటరీ నియోకవర్గం ఇంచార్జ్ గా ఉన్న ఆయన.. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టమెంటరీ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు.. నేతలను కూడగడుతున్నారు.

నిన్న మొన్నటి వరకు ఇంటికే పరిమితమైన నాయకులను స్వయంగా వెళ్లి కలుస్తున్నారు. పార్టీ తరఫున సభలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. నాయకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నారు. అందరినీ కలుపు కొని పోయే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇది పార్టీని బలోపేతం చేస్తోందని సీనియర్లే చెబుతు న్నారు. తాజాగా రాజమండ్రి వేదికగా జవహర్ నేతృత్వంలో నిర్వహించి టీడీపీ సదస్సు దిగ్విజయం అయింది.

ఎక్కడెక్కడి నుంచో నాయకులు ఇక్కడ కువచ్చారు.. పార్టీ తరఫున వాయిస్ వినిపించారు. అంతేకాదు.. జవహర్ స్ఫూర్తిగా తాము కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని… పార్టీని బలోపేతం చేస్తామని.. చెప్పారు. మరి దీనిని బట్టి ఎవరు జూనియర్లు.. ఎవరు సీనియర్లు.. అనేది తెలిసిపోతోందని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post