ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనూహ్యమైన ఆనందపూరిత వాతావరణం కనిపిస్తోంది. త్వరలోనే ఈ నెల 28న అన్నగారు ఎన్టీఆర్ జయంతి ని పురస్కరించుకుని.. మహానాడును నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ముందు సన్నాహకంగా.. అన్ని జిల్లాల్లోనూ మినీ మహానాడులను నిర్వహిస్తున్నారు. దీనికి అనూహ్యమైన స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ప్రకాశం తప్ప.. అన్ని జిల్లాల్లోనూ.. మినీ మహానాడు నిర్వహించాలని.. పార్టీ ఆదేశించింది.

దీంతో నాయకులు జిల్లాల్లో మినీ మహానాడును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు మాజీ మంత్రులు హాజరువుతున్నారు. అదేసమయంలో మాజీ ఎంపీలు కూడా వస్తున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న ప్రసంగాలు.. జగన్ పరిపాలనకు.. టీడీపీ పరిపాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను డిజిటల్ రూపంలో చూపిస్తున్న తీరుకు.. నాయకులతోపాటు. కార్యకర్తలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి ఎందుకురావాల్సిన అవసరం ఉందో సీనియర్‌లు వివరిస్తున్నారు.

గతంలో చంద్రబాబుపాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేయలేదని.. కానీ.. ఇప్పుడు మహానాడు వంటి కీలక కార్యక్రమం చేయాలన్నా.. భయపడాల్సిన పరిస్థితి.. అధినేత జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. నాయకులు చెబుతున్న మాటలతో కార్యకర్తల్లో రక్తం ఉప్పొంగుతోంది. అదేసమయంలో గత మూడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా సీనియర్లు వివరిస్తున్నారు. దీంతో కార్యకర్తలు.. మళ్లీ టీడీపీ రావాలని కోరుకుంటున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ మూడేళ్లలో దాదాపు 8 వేల మంది కార్యకర్తలు.. నాయకులపై కేసులు పెట్టారని. అదే చంద్రబాబు హయాంలో కేవలం 100 మంది వైసీపీ నాయకులపైనే కేసులు పెట్టారని.. అది కూడాక్రికెట్ బెట్టింగులు.. బెదిరింపులు.. రాజధానిలో ధ్వంసాలకు పాల్పడిన కేసులేనని నాయకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధికారంలోకిరాకపోతే.. ఇబ్బందులు తప్పవని.. నూరిపోస్తున్నారు. ఇవన్నీ కూడా మినీ మాహానాడులో చర్చిస్తుండడం నాయకులు. కార్యకర్తలు రీచార్జ్ అవుతుండడం గమనార్హం.

Discussion about this post