టీడీపీకి కీలక బాధ్యతలు చూసిన నాయకులకుఎవరికి వారికే ప్రత్యేకత ఉంది. పార్టీని స్థాపించిన అన్నగా రు ఎన్టీఆర్.. ఒక స్టయిల్ మెయిన్‌టెయిన్ చేశారు. ఆయనలో క్లాస్, మాస్ రెండు ఇమేజ్‌లు ఉన్నాయి. పలు సందర్భాల్లో తన విశ్వరూపాన్ని ఆయన ప్రదర్శించారు. ఇక, తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్ర బాబు రెండు వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. అంటే.. అటు క్లాస్.. ఇటు మాస్‌లను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నించారు. కానీ, చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మాస్ ఇమేజ్ సొంతం చేసుకోలేక పోయారు. విజన్ ఉన్న నాయకుడిగా.. ఆయన క్లాస్ ఇమేజ్‌కే పరిమితమయ్యారు.

ఒకానొక దశలో ఆయనను రాష్ట్రానికి ముఖ్యకార్యనిర్వహణాధికారిగా(సీఈవో) పేర్కొంటూ.. కథనాలు కూడా వచ్చాయి. ఇది మంచిదే. కానీ.. మాస్‌కు ఎక్కలేదు. అందుకే.. ఆయన ప్రతి ఎన్నికలోనూ.. మాస్‌ను ఆక ట్టుకునేందుకు కొంత ఎక్కువగానే శ్రమించారని చెప్పాలి. ఇక, ఇప్పుడు పార్టీ పగ్గాలు భవిష్యత్తులో చేప ట్టేందుకు రెడీ ఉన్నారని.. పార్టీలో గుసగుస వినిపిస్తున్న నాయకుడు.. చంద్రబాబు కుమారుడు.. నారా లోకేష్. ఇప్పుడు ఇదే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అంటే.. తనకంటూ.. ప్రత్యేక ఇమేజ్ కోసం ఆయన పోరాడుతున్నట్టు తెలుస్తోంది.

అంటే… అటు క్లాస్, ఇటు మాస్ అనే మాటను పక్కన పెట్టి.. క్లాస్+మాస్ రెండు కలగలిపి.. ఆయన ప్రజల ను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. దీనివల్ల.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అన్ని వర్గాలు.. కూడా `మనోడు` అని అనిపించుకునేలా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిం చేలా ప్లాన్ చేస్తున్నారని.. పార్టీలో నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.. ఎందుకంటే.. పూర్తిగా క్లాస్ గా ఉన్నా.. పూర్తిగా మాస్‌గా ఇబ్బందే. గతంలో వైసీపీ నేతలు.. ఇదే ఫార్ములాను అవలంభించారు.. అటు మాస్‌కు చేరువ అవుతూనే.. ఇటు క్లాస్ పీపుల్‌ను ఆకట్టుకునేలా వ్యవహరించారు.

ఈ ఫార్ములా.. వైసీపీకి కలిసి వచ్చింది. దీంతో ఇలాంటిదే కాపీ కొట్టడంఅనేది కాకుండా.. తనకంటూ.. ప్రత్యేకంగా ఒక ముద్ర వేసుకునేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారని.. అంటున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే.. ఇక, లోకేష్‌కు తిరుగు ఉండదని.. పార్టీలో చర్చ సాగుతోంది. దీనికిగాను ఆయన త్వరలోనే మీటింగులు.. సమావేశాలు.. పెట్టి.. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. మరి ఆ ప్రత్యేక వేదిక ఎలా ఉంటుందో చూడాలి.

Discussion about this post