మరో వారం రోజుల్లో ప్రథాన ప్రతిపక్షం టీడీపీకి పసుపు పండుగ రానుంది. ఏటా నిర్వహించుకునే మహానా డుకు.. ముహూర్తం దగ్గర పడింది. పార్టీ వ్యవస్థాపక అద్యక్షులు అన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్క రించుకుని ఏటా నిర్వహించుకునే ఈ మహానాడుకు అన్నగారే బీజం వేశారు. అయితే.. ఈ కార్యక్రమం లక్ష్యం.. ఇటీవల కాలంలో వచ్చామా.. వెళ్లామా.. అన్నట్టుగా మారిపోయిందనే విమర్శలు వున్నాయి. అంతేకాదు.. కొందరు మహానాడులో కల్పిత మాత్రంగా కనిపిస్తున్నారు.

కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్న మహానాడుకు.. గతంలో నిర్వహించిన మహానాడుకు చాలా వ్యత్యాసం కనిపి స్తోంది. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో మహానాడును కేవలం వర్చువల్ గానే ముగించారు. కొద్ది మంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు. దీంతో పార్టీ .. అన్ని విషయాలను చర్చించే పరిస్థితి లేకుండా పోయింది. అయితే.. ఇప్పుడు పార్టీ ఒక కీలక దశలో ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలనే తీవ్రమైన పట్టుదలతో ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న మహానాడుకు.. నాయకులు కూడా అంతే పట్టుదలతో.. కాంక్షతో రావాలనేది పార్టీ సీనియర్ల మాట. ఎందుకంటే.. వచ్చామా.. వెళ్లామా.. అనే విధంగా నాయకులు వ్యవహరిస్తే.. ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. ప్రతి సమస్యను… పార్టికి ఎదురవుతున్న ప్రతిసవాలును అధిగమించే విధంగా నాయకులు సిద్ధమై.. మహానాడులో చర్చించాలనేది.. వారి మాట. అంతేకాదు.. కేవలం భారం అంతా.. చంద్రబాబుపై మోపేసి.. మనం చేతులు కట్టుకుంటే.. ఎలా? అనేది కూడా ప్రశ్న.

ప్రస్తుతం పార్టీ పరిస్థితి గమనిస్తే.. పపార్టీ ని నడిపించే బాధ్యత, అధికారంలోకి తెచ్చే బాధ్యత అంతా కూడా..చంద్రబాబుపైనే పడినట్టు కనిపిస్తోంది. మిగిలిన నాయకులు పదువులు వస్తే.. ఎంజాయ్ చేద్దాం.. టికెట్లు ఇస్తే.. పోటీ చేద్దాం.. అనేవిధంగా ఉన్నారే తప్ప.. ఇంతకు మించి! అన్న విధంగా పార్టీతో తమ ఆలోచనలను పంచుకోవడం లేదు. అయితే.. కొద్దిమంది మాత్రం దీనికి మినహాయింపు. మిగిలిన వారితోనే ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహానాడును తేలికగా తీసుకోవద్దని.. సీరియస్‌గా ఉండాలని సీనియర్లు చెబుతున్నారు.

Discussion about this post