రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం అంటే వైసీపీనే అనే పరిస్తితి ఉంటుంది..వైసీపీలో రెడ్డి వర్గానికే ప్రాధాన్యత ఉంటుందనే విషయం చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ ప్రాధాన్యత అనేది కొందరు నేతల వరకే ఉంటుంది. అయినా సరే రెడ్డి వర్గం మెజారిటీ వైసీపీకే సపోర్ట్ ఇస్తుంది. గత ఎన్నికల్లో వన్‌సైడ్ గా రెడ్డి వర్గం వైసీపీ వైపు నిలబడింది. అందుకే గుంటూరు టూ అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ వైసీపీ నుంచి రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు సత్తా చాటారు.

అయితే రెడ్డి వర్గం నేతలు టీడీపీలో కూడా ఉన్నారు. చంద్రబాబుని అభిమానించే రెడ్డి వర్గం నేతలు ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో టిడిపి నుంచి ఒక్క రెడ్డి నేత గెలవలేదు. ఇక ఈ సారి ఎన్నికల్లో మాత్రం రెడ్డి వర్గం నేతలు సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది. టిడిపి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి రెడ్డి నేతలు పార్టీ కోసం గట్టిగా కష్టపడుతున్నారు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలనే దిశగా పనిచేస్తున్నారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దినేష్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, జేసి ప్రభాకర్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుజాతమ్మ, గౌరు చరితా రెడ్డి, వెంకటరెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, జయనాగేశ్వర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, తిక్కారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి..ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీలో రెడ్డి నేతలు ఎక్కువగానే ఉన్నారు.

ఈ సారి వైసీపీలోని రెడ్డి నేతలకు చెక్ పెట్టి సత్తా చాటాలని టిడిపి రెడ్డి నేతలు కష్టపడుతున్నారు. పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ముందుకెళుతున్నారు.
