తెలుగుదేశం పార్టీలోకి ఎంతో మంది నేతలు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. అయితే వివాదాలకు దూరంగా.. పార్టీ కష్టనష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడకుండా కమిట్‌మెంట్‌తో ఉండే నాయకులు కొందరే ఉంటారు. ఎప్పుడూ ఇబ్బంది వచ్చిన పార్టీకి మాత్రం ఎప్పుడు నష్టం కలగకుండా చూసుకునే తక్కువ మంది నేతల్లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఒకరు. ఆయన ప్రజా క్షేత్రంలో అయినా… అసెంబ్లీలో అయినా ఇప్పుడు హుందాతనంతోనే రాజకీయాలు చేస్తూ ఉంటారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై విమర్శలు చేసేటప్పుడు కూడా గద్దె ప్రసంగంలో హుందాతనం కనిపిస్తుంది. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాం… మన వ్యతిరేక పార్టీయే కదా నాలుగు రాళ్ళు వేసేద్దాం… అన్నట్టుగా గద్దే ప్రసంగాలు ఎప్పుడూ ఉండవు. అయితే ఇప్పుడు అదే టిడిపిలో మరో గద్దె రామ్మోహన్ వచ్చాడని పార్టీ నేతల మధ్య చర్చ నడుస్తోంది.

ఆ నేత ఎవరో కాదు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టిడిపి ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు. దివంగత ఎన్టీఆర్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వీరాభిమాని అయిన ఆయన బెంగళూరులో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు కళ్యాణదుర్గం టిడిపిలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఆయనకు టిక్కెట్ ఇచ్చారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు గట్టి పోటీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచి.. టీడీపీలో యోధానుయోధులు కూడా చిత్తుగా ఓడిపోయినా… కళ్యాణదుర్గంలో టిడిపి గట్టి పోటీ ఇచ్చింది.

ఆకట్టుకునే వ్యక్తిత్వం సూటిగా… స్పష్టంగా ఉండే ప్రసంగాలు, పార్టీ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండటం… ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ సూక్తిని ఎప్పుడూ నిజం చేస్తూ ప్రజలకు అంకితం కావడం… ఇవన్నీ ఉమామహేశ్వర నాయుడికి తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి నమ్మకం కలిగేలా చేశాయి. గత ఎన్నికల్లో ఓడినా ఉమా మాత్రం ప్రతిరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన ఉషాశ్రీ చరణ్ గుర్తొచ్చినప్పుడు మాత్రమే కళ్యాణదుర్గం ప్రజలకు కనిపిస్తున్నారు. ఆమె ఎక్కువగా బెంగళూరులో ఉంటూ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా మాత్రమే వస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఉమా మాత్రం ఎమ్మెల్యేను మించి ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు.

నియోజకవర్గంలో చిన్న స్థాయి కార్యకర్తల నుంచి.. ఎవరు చనిపోయినా పేద ప్రజలకు ఇబ్బంది వచ్చినా ఉమా తక్షణమే అక్కడ వాలిపోతున్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ చేపట్టని విధంగా చంద్రన్న స్ఫూర్తితో ఉమన్న ఆర్థిక సాయం పేరిట ఆయన తన వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. గత సాధారణ ఎన్నికలకు ముందు కళ్యాణదుర్గం టిడిపి గ్రూపుల గోలతో కొట్టుమిట్టాడేది. అయితే అక్కడ ఉమామహేశ్వర్ నాయుడు ఎంట్రీ ఇచ్చాక తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఒకే తాటి మీదకు వచ్చింది. కాంట్రవర్సి రాజకీయాలకు దూరంగా స్మార్ట్ పొలిటీషియన్ గా జిల్లా రాజకీయాల్లో ఉమా తనదైన ముద్ర వేసుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గంపై టీడీపీ జెండా ఎగరాలి అంటే ఉమాతోనే సాధ్యం అవుతుందని నియోజకవర్గ టిడిపి గట్టిగా నమ్ముతోంది. ఆయన నియోజకవర్గంలో కాంట్రవర్సీ పాలిటిక్స్ ప్రోత్సహించేందుకు అస్సలు ఇష్టపడరు అని స్థానిక జనాలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ప్రజాప్రతినిధిపై తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఆయన సులువుగా గెలుస్తారన్న చర్చ ఉంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో స్మార్ట్ పొలిటీషియన్ గా మాదినేని ఉమామహేశ్వర నాయుడు భవిష్యత్తులో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోనున్నారు.

Discussion about this post